Payam Venkateswarlu finned by Public Resprestative Court టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష

Court sentences former trs mla payam venkateswarlu six months jail

Payam Venkateswarlu fined, pinapaka former MLA fined, Public Representative Court, Payam Venkateswarlu finred rs 10000, Payam Venkateswarlu jail term, TRS leader Payam Venkateswarlu, former mla Payam, Pinapaka former MLA Payam,Vote for note, Court fined Payam, Jail term for Payam, TRS former MLA, Pinapaka, Manuguru, Khammam, Telangana, POlitics

Public Representatives Court Sentences former TRS MLA Payam Venkateswarlu six months Jail and fined Rs 10,000 declaring its verdict in Vote for Note case.

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలల జైలుశిక్ష

Posted: 08/13/2021 12:21 PM IST
Court sentences former trs mla payam venkateswarlu six months jail

రాష్ట్ అసెంబ్లీకి 2018లో జరిగే ఎన్నికలలో డబ్బులు విపరీతంగా ప్రభావం చూపాయన్న అరోపణలు ఇప్పటికీ వున్నాయి. ప్రతీ ఎన్నికలలో ఓటర్లకు డబ్బులు పంఫిణీ చేయడం సర్వాసాధారణమైన విషయంగా మారినా.. 2018 అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం వీటి ప్రభావం మరింతగా కనిపించిందని వాదనలు వున్నాయి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు విపరీతంగా డబ్బులు పంపీణీ చేశారన్న అరోపణలు కూడా వున్నాయి. అయితే రాజకీయాలలో వున్న అన్ని పార్టీలో తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా నోట్లను పంచుతాయన్న విషయం తెలిసిందే.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వెంకటేశ్వర్లును దోషిగా నిర్ధారించింది. ఆయనపై మోపబడిన అభియోగాలు నిజమని న్యాయస్థానం విచారణలో ధృవీకరించిన పిమ్మట.. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటుగా రూ. 10 వేల జరిమానా విధించింది. ఆయనతో పాటు ఈ కేసులో దోషిగా తేలిన ఆయన అనుచరుడైన గద్దెల నాగేశ్వర రావుకు కూడా ఇదే శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది.

ఆ ఎన్నికల్లో గద్దల నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా పాయం వెంకటేశ్వర్లు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయనతోపాటు పాయంపైనా కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు ఇద్దరికీ జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధించింది. దీంతో పాయం వెంకటేశ్వర్లు రూ. 10 వేల జరిమానా చెల్లించారు. అనంతరం జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు కోర్టును కోరారు. అనుమతించిన న్యాయస్థానం జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles