Justice RF Nariman Retires, CJI Says "Losing One Of The Lions" జస్టిస్ నారిమన్ రిటైర్మెంట్: న్యాయ సింహాన్ని కోల్పోయామన్న సీజేఐ

Losing one of the lions of indian judiciary says cji on retirement of justice r f nariman

Justice Rohinton Fali Nariman, Supreme Court, CJI NV Ramana, Lion of Indian Judiciary, Retirement, Legal news, justice nariman retirement, rohinton Nariman, fali sam nariman fees, justice nariman judgement, fali sam Nariman, justice nariman retirement, justice Nariman, justice nariman speech, justice nariman judgement, justice nariman religion , justice nariman on arbitration, justice nariman lecture, justice rf nariman religion, justice rohinton nariman

Justice Rohinton Fali Nariman, a high profile Supreme Court judge involved in several landmark judgments, retired today with Chief Justice NV Ramana describing him as a "lion of a judge" and the legal fraternity praising his legacy. "I feel like I am losing one of the lions that guarded the judicial institution, someone known for his erudition, clarity and scholarly work.

జస్టిస్ నారిమన్ రిటైర్మెంట్: న్యాయ సింహాన్ని కోల్పోయామన్న సీజేఐ

Posted: 08/12/2021 05:02 PM IST
Losing one of the lions of indian judiciary says cji on retirement of justice r f nariman

పలు కీలక తీర్పుల్లో భాగస్వామైన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీనియ‌ర్ జడ్జి.. జస్టిస్ రోహింగ్ట‌న్ ఫాలీ నారీమ‌న్ ఇవాళ రిటైర్ అయ్యారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన నారీమన్.. ఇవాళ పదవీ విరమణ పోందారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణతో కలిసి కోర్టు హాల్ నంబర్-1లో కూర్చున్నారు. రిటైర్ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం ఆనవాయతీగా వస్తోంది. జస్టిస్ నారీమన్ కు వీడ్కోలు పలికే కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్ష‌ణం కొంత ఉద్విగ్నంగా ఉంద‌ని, తన ఆలోచ‌న‌ల్ని వ్య‌క్త‌ప‌ర‌చ‌డం ఇబ్బందిగా ఉంద‌ని సీజే ర‌మ‌ణ అన్నారు.

నారీమన్​ పదవీ విరమణతో న్యాయవ్యవస్థకు రక్షణగా ఉన్న సింహాల్లో ఒకదాన్ని కోల్పోయినట్లు తాను భావిస్తున్నాని ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్‌ ఆర్​ఎఫ్​ నారీమన్‌ రూపంలో భారత న్యాయవ్యవస్థ అపార అనుభవమున్న ఓ న్యాయమూర్తిని కోల్పోయిందని ఎన్వీ రమణ అన్నారు. మన బలమైన న్యాయ వ్యవస్థకు ఆయ‌న ఒక పిల్ల‌ర్ అన్నారు. నారీమ‌న్‌ ఎల్ల‌ప్పుడూ న్యాయం వైపు నిల‌బ‌డ్డ‌ట్లు సీజేఐ చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన ఏడేళ్ల పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులను నారీమన్​ వెలువరించారని పేర్కొన్నారు. 35 ఏళ్లపాటు విజయవంతంగా న్యాయవాదిగా సేవలందించిన జస్టిస్‌ నారీమన్‌.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఐదో లాయర్ అని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు.

కాగా, ప్ర‌ఖ్యాత న్యాయ‌వాది ఫాలీ నారీమ‌న్ కుమారుడే రోహింగ్ట‌న్ నారీమ‌న్‌. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దివిన జ‌స్టిస్ నారీమ‌న్ 35 ఏళ్ల పాటు న్యాయ‌వృత్తిలో కొన‌సాగారు. 37 ఏళ్ల వ‌య‌సులో సీనియ‌ర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టులో రోహింగ్ట‌న్ నియ‌మితులైయ్యారు. 2011లో ఆయ‌న్ను సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా నియ‌మించారు. 2014 జులై 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ నారీమన్‌.. తన ఏడేళ్ల కాలంలో 13,500 కేసులను పరిష్కరించారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి పోలీసులకు అరెస్ట్‌ చేసే అధికారమిచ్చే ఐటీ చట్టంలోని నిబంధన కొట్టివేత, స్వలింగ సంపర్కం నేరం కాదని, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటి చారిత్రక తీర్పులు వెలువరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles