Etela Rajender challenges Harish Rao on Assets టీఆర్ఎస్ పార్టీకి మాజీమంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా

Are you ready for inquiry with sitting judge etela rajender challenges harish rao

etela rajender, Gellu Srinivas, BJP, TRS, Harish Rao, sitting Judge, assets, etela rajender challenges Harish Rao, etela rajender news, etela rajender trs, etela rajender mla, etela rajender new party, etela rajender news latest, etela rajender updates, Etela Rajender resigns from TRS, Etela Rajender to join BJP, Telangana minister, Jamuna Hatcheries, Hyderabad, Talangana, Politics

All eyes are on ensuing Huzurbad elections and political party leaders on busy on tours across the constituency. TRS Minister Harish Rao and BJP leader Etela Rajender indulged in verbal war. Etela Rajender dared Harish Rao and asked him to go for inquiry over their assets before joining and after the TRS party.

‘‘సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా.?’’ హరీష్ రావుకు ఈటెల సవాల్

Posted: 08/12/2021 05:59 PM IST
Are you ready for inquiry with sitting judge etela rajender challenges harish rao

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తన గురించి అసత్య ప్రచారాలు చెప్పి హుజూరాబాద్ ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని హరీశ్ రావు చేస్తున్నారని మండిపడ్డారు. తన మామ కేసీఆర్ మెప్పు పొందేందుకే హరీశ్ రావు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హరీశ్ రావు మోసపు మాటలను హుజూరాబాద్ ప్రజలు నమ్మె అస్కారమే లేదని అన్నారు. ఎన్నికల కోసమే కొత్త డ్రామాలు వేస్తున్న టీఆర్ఎస్ నేతలు.. అంతకుముందు ఏం చేశారో.. ఎన్నికలు పూర్తైన తరువాత ఎన్ని సార్లు ఏ నాయకులు వస్తారో కూడా ఇక్కడి ప్రజలు అర్థం చేసుకోగలరని ఆయన దుయ్యబట్టారు.

హుజూరాబాద్ ప్రజల ప్రేమను పొంది, వరుసగా గెలుస్తున్న వ్యక్తిని తానని చెప్పారు. టీఆర్ఎస్ అబ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు రెండు గుంటల భూమి ఉందని.. కొత్త పంథాను ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ సహా హరీశ్ రావుకు దిమ్మదిరిగే సవాల్ ఇచ్చారు. రాజకీయాల్లోకి తాను చేరడానికి ముందు తనకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అన్నారు. అదే విధంగా 2001లో హరీశ్ రావుకు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులపై న్యాయ విచారణ.. సిబీఐ దర్యాప్తుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ విషయంపై అబిడ్స్ లో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

హరీశ్ రావు అనవసర విమర్శలు చేసి పలుచన కావొద్దని ఈటల సూచించారు. సిద్దిపేటలో హరీశ్ వరుస విజయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ కేసీఆర్ నియోజకవర్గంలో నిల్చోవడం వల్లే హరీశ్ వరుసగా గెలుస్తున్నడని ఈటల సాలిడ్ పంచ్ వేశారు. తాను హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించి గెలుస్తున్న అని అన్నారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన హరీశ్ కు తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని... దుబ్బాక ఎన్నికలో కూడా ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పిన హరీశ్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా హరీశ్ కు బుద్ధి చెపుతారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  Gellu Srinivas  BJP  TRS  Harish Rao  sitting Judge  assets  Hyderabad  Talangana  Politics  

Other Articles