Lenskart to add 2,000 employees next year నిరుద్యోగ యువతకు లెన్స్ కార్ట్ గుడ్ న్యూస్.. 7 నెలల్లో 2 వేల ఉద్యోగాలు

Lenskart plans to hire over 2 000 employees in india by next year

Lenskart News, lenskart hiring, Lenskart employees, Lenskart, Lenskart hiring, Lenskart jobs, eyewear, eyewear brand, Bengaluru, NCR, Hyderabad, Employement, Data Engineers, Employees, career

Eyewear brand Lenskart plans to add over 2,000 employees over 2,000 employees over the next year across its tech and data engineers, among others. The company is looking to add 1,500 employees in retail to manage its stores and over 100 engineers to its technology team across Bengaluru, NCR, and Hyderabad.

నిరుద్యోగ యువతకు లెన్స్ కార్ట్ గుడ్ న్యూస్.. ఏడు నెలల్లో 2 వేల ఉద్యోగాలు

Posted: 08/12/2021 04:06 PM IST
Lenskart plans to hire over 2 000 employees in india by next year

ఉత్తర్ ప్రదేశ్ లోని ఫరీధాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా తన చైన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న కళ్లజోడు బ్రాండ్ సంస్థ లెన్స్ కార్ట్.. నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా 2000 మంది ఉద్యోగులను తీసుకుని తమ ఉద్యోగుల సంఖ్యలో మరింత పెంచుకుంటామని అంటోంది. లెన్స్‌కార్ట్ 300 మంది ఉద్యోగులను సింగపూర్, మిడిల్ ఈస్ట్ సహా అమెరికాలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది. దీంతో లెన్స్ కార్ట్ తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగానూ విస్తరించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు లెన్స్ కార్ట్ ఒక ప్రకటనలో పేర్కోంది.

డేటా సైంటిస్టులు, బిజినెస్ ఎనలిస్టులు, డేటా ఇంజినీర్లు మరియు నిపుణులతో పాటు తమ వాపార దుకాణాల్లో పనిచేసే సాధారణ ఉద్యోగులను కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఓ వైపు తమ కంపెనీ టెక్నాలజీ సహాడేటా సైన్స్ టీమ్‌ను బలపేతం చేసుకుంటూనే మరోవైపు లెన్స్ కార్ట్ స్టోర్‌ల నిర్వహణకు 1,500 మంది రిటైల్ ఉద్యోగులను నియమించుకోనుంది. బెంగుళూరు, ఎన్‌సిఆర్ హైదరాబాద్ అంతటా 100 మంది ఇంజనీర్లను సాంకేతిక బృందానికి చేర్చాలని చూస్తోంది. ఇక వీరితో పాటు మరో 300 మంది కళ్లజోళ్లు తయారీ కార్యకలాపాలలో నియమాకం అవుతారని చెప్పంది.

దీంతో పాటు కొందరికి ఫైనాన్స్, వినియోగదారు అంతర్దృష్టులు, మానవ వనరులు, మర్చండైజింగ్ అంతటా కార్పొరేట్ ఫంక్షన్ల కోసం 100 మందిని నియమించుకుంటామని ప్రకటనలో పేర్కోంది. 2010 లో బన్సాల్, అమిత్ చౌదరి మరియు సుమీత్ కపాహి స్థాపించిన లెన్స్ కార్ట్ దేశంలోని ప్రధాననగరాల్లో 750 పైగా తమ ఓమ్ని చానెల్ స్టోర్స్ కలిగి ఉంది. భారతదేశం, సింగపూర్, మధ్యప్రాచ్య దేశాలలో ప్రతి సంవత్సరం 70 లక్షల మందికిపైగా కస్టమర్లకు తమ చైన్ షాపింగ్ ద్వారా సేవలను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lenskart  eyewear brand  Bengaluru  NCR  Hyderabad  Employement  Data Engineers  Employees  career  

Other Articles