Three persons arrested in honeytrap case వలపు వలలో చిక్కిన సాప్ట్ వేర్ ఇంజినీర్.. రూ.24 లక్షలు టోకరా..

Couple held for honey trap and extortion software engineer through nude video calls

honey trap, software engineer, nude video call, social media, nude screenshots, cybercrime police, Hyderabad, vishakapatnam, Andhra pradesh, Crime

The cyber crime police cracked a honeytrap case by arresting three persons, including a woman, who reportedly blackmailed a local and forced him to pay ₹24 lakh. The arrested were identified as Shaik Abdul Raheem (30) of Krishna district, Gunda Jyothi (28), and her husband Gunda Veera Satish (34), both hailing from Jeedimetla in Hyderabad.

వలపు వలలో చిక్కిన సాప్ట్ వేర్ ఇంజినీర్.. రూ.24 లక్షలు టోకరా..

Posted: 08/12/2021 12:22 PM IST
Couple held for honey trap and extortion software engineer through nude video calls

వలపు వలలో చిక్కుకుని బడాబాబులే బలైపోతున్న తరుణంలో.. పెద్దగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన సంపాదనంతా వారికి సమర్పించుకున్నాడు. అయినా వారి నుంచి వేధింపులకు ఆగకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. గత ఏడాది నవంబర్ నుంచి జూలై వరకు ఒక్క బాధితుడి నుంచి ఏకంగా రూ. 24 లక్షలు ఈ ముఠా నొక్కేసిందంటే.. ఇంతకుముందు ఎందరి నుంచి ఎంతమేర దోచుకుందన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

విశాఖపట్టణం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా వేపగుంటకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు గతేడాది నవంబరు 6న కవ్వించే ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిచూడంగానే ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనుభవం పోందిన ఇంజనీర్.. ఆ మెసేజ్ ను చదివారు. ‘కాల్‌ మీ ఎనీటైమ్. ఐయామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్’ అని ఉన్న ఆ మెసేజ్‌లో 55678557 నంబరుకు కాల్ చేయాలని ఉంది. ఆలస్యం చేయకుండా ఆ నంబరుకు కాల్ చేశాడు. అటునుంచి ఓ అడ గొంతు మత్తెక్కించేలా మాట్లాడుతూ.. మాటలు కలిపింది. అంతేకాదు ఇంజనీరును మాటల్లోకి దింపి న్యూడ్ గా వీడియో కాల్ చేయమని కోరింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆమె అడిగిందే తడవుగా వీడియో కాల్ చేశాడు.

ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే న్యూడ్ వీడియో కాల్ చేసి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇలా వెనకాముందు అలోచించకుండా అడిగింతే తడవుగా వీడియో కాల్ మాట్లాడడంతో ఇంజనీరుకు కష్టాలు మొదలయ్యాయి.  న్యూడ్ వీడియో కాల్ స్క్రీన్‌షాట్లు పంపిన ఆ యువతి డబ్బుల కోసం డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించింది. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగి అతడిని బెదిరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కితే తన పరువు పోతుందని భయపడిన బాధితుడు పలు దఫాలుగా వారు అడిగినంత చెల్లించుకున్నాడు. మొత్తంగా రూ. 24 లక్షలు సమర్పించుకున్నాడు. మళ్లీ బెదిరింపులు కొనసాగాయి.

తాను వలపు వల చక్రబంధంలో చిక్కకుపోయనట్లు గ్రహించిన బాధితుడు జులై 16న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. కృష్ణా జిల్లా దబ్బకుపల్లికి చెందిన షేక్ అబ్దుల్ రహీం (30), జీడిమెట్లకు చెందిన దంపతులు గుండా జ్యోతి (28), గుండీ వీర సతీష్ (34)లు హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.5 లక్షల నగదు, ల్యాప్‌టాప్, 8 మొబైల్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles