దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అర్థాంతరంగా ముగించేసిన తీరుపై నిరసనను వ్యక్తం చేసిన విపక్షాలు ఇవాళ విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ఉభయసభల్లో ప్రజాప్రతినిధులపై చేయిచేసుకున్న ఘటనలపై విపక్షాలు తివ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష నేతలు పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వమే ఖూనీ చేయడమేనని అరోపించాయి.
పార్లమెంటు ఉబయసభల్లో విపక్ష నేతల గొంతును ప్రభుత్వం నొక్కి పెట్టిందని, దీంతో పార్లమెంటులో మాట్లాడే అవకాశం లేనందునే ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజ్యసభలో భీమా బిల్లును అడ్డుకునే క్రమంలో వెల్ లోకి దూసుకువచ్చి విపక్ష ఎంపీలతో పాటు మహిళా ఎంపీలపై భౌతికంగా దాడి చేశారని రాహుల్ విమర్శించారు. రాజ్యసభలోని విపక్ష ఎంపీలపై దాడులు చేసేందుక పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది కాని భయటివారిని కూడా సభలోకి రానిచ్చారని ఆయన అరోపించారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పిర్యాదు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిశాయని, 60 శాతం దేశ జనాభా అసలు పార్లమెంట్ సెషన్ జరగలేదన్న అభిప్రాయంలో ఉందని, 60 శాతం మంది ప్రజల గొంతును నొక్కిపెట్టారన్నారు. రాజ్యసభలో బుధవారం మహిళా ఎంపీల పట్ల మార్షల్స్ వ్యవహరించిన తీరు సరిగా లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. తాము పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నా.. తమను పాకిస్తాన్ బోర్డర్ లో నిలబడినట్లుగా ఉందన్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేత మల్లిఖార్జున్ ఖార్గే, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్, మనోజ్ ఝా సహా పలువురు విపక్ష నేతలు పాల్గోన్నారు.
కాగా, పార్లమెంట్ సమావేశాలను ముందుగా వాయిదా వేసిన ఘటనలో ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు ఎదురు చూస్తారని, కానీ విపక్షాలు అరాచకాన్ని సృష్టించాయని, వాళ్లు ప్రజల గురించి పట్టించుకోలేదని, పన్నుదారుడి సొమ్ము వృధా అయ్యిందని మంత్రులు విమర్శించారు. రాజ్యసభలో జరిగిన ఘటనను ఖండిస్తున్నామని, మొసలి కన్నీళ్లు ఆపేసి, విపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. బిల్లులు పాసవుతున్న తీరును విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మంత్రులు విమర్శించారు.
#WATCH CCTV visuals of Opposition MPs jostling with marshals in Parliament yesterday pic.twitter.com/yfJsbCzrhl
— ANI (@ANI) August 12, 2021
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more