DCGI approves study on mixing Covaxin, Covishield vaccines వాక్సీన్ మిక్సింగ్ పై అధ్యయనానికి డీజీసిఐ అనుమతి

Study on mixing covaxin covishield vaccines gets drug regulator approval

covaxin, covishield, cocktail, mixing vaccine, covid variants, niti ayog, vaccine mixing, Vellore Medical College, DGCI, covaxin covishield mixing, covid vaccines mixing, coronavirus vaccine mixing, covid vaccine mixing result, icmr, india covid 19 vaccines, safe, more immune to covid variants, Covid-19, coronavirus

The Drugs Controller General of India (DCGI) has given its approval for a study on mixing of Covaxin and Covishield Covid-19 vaccines in India. This study and its clinical trials will be conducted by Christian Medical College, Vellore. On July 29, a Subject Expert Committee of the Central Drugs Standard Control Organisation (CDSCO) had recommended conducting this study.

వాక్సీన్ మిక్సింగ్ అధ్యయనానికి డీజీసీఐ అనుమతి.. మిశ్రమ ఫలితాల కోసమే స్టడీ

Posted: 08/11/2021 03:04 PM IST
Study on mixing covaxin covishield vaccines gets drug regulator approval

 కరోనా వైరస్‌ మహమ్మారి క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచంపై తన ప్రభావాన్ని చాటుతున్న తరుణంలో దానిని సమూలంగా అంతం చేయడానికి పరిశోధనలు కోనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు పలు దేశాలు పలు రకాల వాక్సీన్లను తీసుకువచ్చినా.. అవన్నీ కరోనాను కట్టడి చేయడానికే. కాగా కరోనాను అంతం చేసేందుకు సరైన వాక్సీన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వినియోగంలో వున్న వాక్సీన్లు కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పలు దేశాల్లో వాక్సీన్ మిక్సింగ్ పై కూడా అధ్యయనాలు చేస్తున్నారు. వాటి ఫలితాలు మరింత ధీటుగా వున్నాయని.. అవి కరోనా మహమ్మారిపై అమోఘమైన ప్రభావాన్ని చాటుతున్నాయని కనుగొన్నారు. వీటి వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోంటున్నాయని అధ్యయన పలితాలు వెల్లడిస్తున్నాయి, దీంతో భారతదేశంలోనూ వాక్సీన్ మిక్సింగ్ అధ్యయనాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీజీసీఐ అనుమతినిచ్చింది.  త‌మిళ‌నాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ మిక్సింగ్‌పై అధ్య‌య‌నం చేప‌ట్ట‌నున్న‌ట్లు నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వీకే పౌల్ తెలిపారు.

సుమారు 300 మంది వలంటీర్లపై వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌లో త్వరలో ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్ పై స్ట‌డీ చేప‌ట్టాల‌ని జూలై 29న సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ ఓ ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే మిక్సింగ్ పై గ‌తంలో ఐసీఎంఆర్ చేసిన స్ట‌డీకి ఇది భిన్నంగా ఉండ‌నున్న‌ది. ఐసీఎంఆర్ చేసిన అధ్యయనంలో తొలి టీకా రెండో టీకా వేర్వేరుగా తీసుకోవడంపై సాగగా, ఇప్పుడు తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అందుకు భిన్నమైన విధంగా స్టడీ జరగనుంది. వాక్సీన్ మిక్సింగ్ లతో పాటు వాక్సీన్ కాక్ టెయిల్ పై కూడా ఇక్కడ అధ్యయనం జరగనుందని తెలుస్తోంది.

దేశంలో అందుబాటులో వున్న కొవాగ్జిన్‌ (బయోఎన్ టెక్), కొవిషీల్డ్‌ (విదేశాల్లో ఆస్ట్రాజెనెకా) టీకాలను వేర్వేరుగా ఒక్కో డోసు చొప్పున తీసుకోవడం సురక్షితమేనని ఇటీవల ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీ అధ్యయనం వెల్లడించింది. ఒకే రకమైన టీకా రెండు డోసులను తీసుకున్నవారితో పోల్చితే.. రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకున్నవారిలో రోగనిరోధకశక్తి అధికంగా పెంపొందుతున్నట్టు వివరించింది. ఆల్ఫా, బీటా, డెల్టా వంటి వేరియంట్లపై ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబర్చిందని పేర్కొంది. కాగా టీకా మిక్సింగ్ పై జరిపిన అద్యయనాలను మరింతగా సమీక్షించాల్సి ఉంది. ఈ వివరాలు ప్రీ-ప్రింట్‌ సర్వర్‌ ‘మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీ’లో ప్రచురితమయ్యాయి.

ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ్ నగర్ లోని ఓ టీకా కేంద్రంలో తొలి అధ్యయనం జరిగింది, 18 మందికి తొలి దఫాలో కొవిషీల్డ్‌.. రెండో దఫాలో కొవాగ్జిన్‌ టీకాను ఇచ్చారు. దీంతో ఐసీఎంఆర్‌- ఎన్‌ఐవీకి చెందిన నిపుణుల బృందం వీరిపై అధ్యయనం చేసింది. ఈ క్రమంలో రెండు డోసుల కొవాగ్జిన్‌, రెండు డోసుల కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారిని 40 మంది చోప్పున ఎంచుకుని.. టీకాల మిక్సింగ్ తీసుకున్న 18 మందిపై మే, జూన్‌, 2021లో అధ్యయనం నిర్వహించారు. దీంతో మిక్సింగ్ టీ్కాలు తీసుకున్న 18 మందిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా వృద్ధి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా, మిశ్ర‌మ టీకాలపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని నిపుణుల క‌మిటీ భావిస్తున్న నేప‌థ్యంలో వెల్లూర్ మెడిక‌ల్ కాలేజీలో మ‌రోసారి ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles