CBI Questions Sakshi reportet in YS Viveka case వైఎస్ వివేక హత్యకేసు: సాక్షి ప్రతినిధిని ప్రశ్నించిన సీబీఐ

Ys vivekananda reddy murder case cbi widens probe angle

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The CBI, probing former minister YS Vivekananda Reddy murder case, is looking into multiple motives, including a Karnataka land deal and political rivalry within and outside the YSR Congress Party. As a Part CBI sleuths questioned Sakshi Reporter BalaKrishna Reddy.

‘‘వైఎస్ వివేక గుండెపోటుతో మరణించారా.?’’ సాక్షి ప్రతినిధికి సీబీఐ ప్రశ్న

Posted: 08/11/2021 01:23 PM IST
Ys vivekananda reddy murder case cbi widens probe angle

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను కడప జిల్లాలోని పులివెందుల కోర్టులో హాజరుపర్చిన సీబీఐ గత మూడు రోజులుగా ఆయుధాల అన్వేషణను చేపట్టినా ఫలితం లేకపోవడంతో దానిని నిలిపివేసింది. వైఎస్ వివేకా హత్యకేసులో వాచ్ మెన్ రంగయ్య నుంచి సేకరించిన క్రీయాశీలక సమాచారం నేపథ్యంలో జోరు పెంచిన సీబీఐ.. కేసును మరో కోణంలోనూ విచారణ ప్రారంభించింది. వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన వార్తను సాక్షి టీవీలో ప్రసారం అయ్యిందని.. తొలుత వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని వార్త ప్రసారమైంది.

ఈ నేపథ్యంలో సీబిఐ అధికారులు సాక్షి పత్రిక విలేకరిని ప్రశ్నించారని వార్తలు వెలువడ్డాయి. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్టు అప్పట్లో సాక్షి మీడియాలో వార్తలు రావడంతో ఆ కోణంలోనూ సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా బ్యూరో ఇన్‌ చార్జ్‌ బాలకృష్ణారెడ్డిని సీబీఐ విచారించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్ చార్జ్ గా ఉన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్టు సాక్షి టీవీ చానల్ ప్రతినిధిగా వార్తలు అందించడంపై సీబిఐ ఆయనను ప్రశ్నించింది.

వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారన్న విషయాన్ని మీకెవరు చెప్పారని బాలకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ తనకు, టీవీకి సంబంధం లేదని, తాను పత్రికకు మాత్రమే పనిచేస్తానని చెప్పినట్టు సమాచారం. కాగా, సీబీఐ అధికారులు నిన్న 12 మంది అనుమానితులను విచారించారు. వీరిలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు రాఘవరెడ్డి, రమణారెడ్డి, అప్పటి పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్య, హోంగార్డు నాగభూషణంరెడ్డి, సాక్షి పత్రిక బ్యూరో ఇన్ చార్జ్ బాలకృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, మల్లి, చెన్నకేశవ, రహమ్తుల్లా ఖాన్, ఉమాశంకర్‌రెడ్డి, అంజిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles