bomb threat creates panic in Ameerpet metro station అమీర్‌పేట మెట్రోస్టేషన్ చెత్తడబ్బాలో సెల్ పోన్ వైబ్రేషన్.. బాంబు కలకలం..

Mobile phone vibration mistaken to bomb creates panic in ameerpet metro station

Ameerpet metro station, Mobile phone vibration, bomb scare, SR Nagar Police, Hyderabad Police, Hyderabad Bomb Squad, Sniffer dogs, Hyderabad Latest News, Telangana, crime

Panic gripped Ameerpet metro station in Hyderabad following a bomb scare. Getting into details, the metro security staff mistook the mobile phone vibration in the trash can as bomb and informed the police.

అమీర్‌పేట మెట్రోస్టేషన్ చెత్తడబ్బాలో సెల్ పోన్ వైబ్రేషన్.. బాంబు కలకలం..

Posted: 08/11/2021 11:33 AM IST
Mobile phone vibration mistaken to bomb creates panic in ameerpet metro station

హైదరాబాద్ అమీర్ పేటలోని మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టారన్న వార్త తీవ్ర కలకలం రేపింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ పరిధలోని ఓ చెత్త డబ్బాలో ఓ సెల్ ఫోన్ వుందని, అది వైబ్రేషన్ మోడ్ లో వుందని.. దీంతో అది బాంబు కావచ్చునన్న అనుమానాలు ఊపందుకున్నాయి. ఈ వార్త నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎస్ ఆర్ నగర్ పోలీసులతో పాటు బాంబ్‌స్క్వాడ్ ను ఉరుకులు పరుగులు పెట్టించినా.. చివరికి అనుమానిత సెల్ ఫోన్ బాంబు కాదని తెలియడంతో పోలీసులు, ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. మెట్రో స్టేషన్‌లో అటు ఉప్పల్, ఇటు ఎల్బీనగర్ వైపు వెళ్లే టర్నినల్ వైపు (ఆదిత్య ఎన్ క్లేవ్ వైపు) ఉన్న చెత్త డబ్బాలో అనుమానిత వస్తువేదో ఉన్నట్టు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అది ఏంటని దెగ్గరకు వెళ్లి పరిశీలించారు. అయితే అందులో ఒక సెల్ ఫోన్ వుందని గమనించి.. దానిని బాంబుగా భావించారు. కాగా అది వైబ్రేషన్ మోడ్ లో వుందని, వైబ్రేట్ అవుతోందని కూడా గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే పోలీసు కంట్రోల్ రూముకు సమాచారం అందించారు.

సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబ్‌ స్క్వాడ్, ఎస్సార్ నగర్ పోలీసులు హుటాహుటిన మెట్రో రైల్ స్టేషన్ కు చేరుకుని తనిఖీ చేశారు. చివరికి పోలీసు డాగ్ స్వ్కాడ్ సాయంతో చెత్తడబ్బాలో గాలించగా ఆ సెల్ ఫోన్ అనుమానితమైనది కాదని తేల్చారు. ఈ మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో దానిని ప్రయాణికులు చెత్తడబ్బాలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు లేదని తెలియడంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులతో పాటు బాంబ్ స్వ్కాడ్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles