Krafton permanently bans over 3,00,000 accounts బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ షాకింగ్ నిర్ణ‌యం.. నిషేధం అమలు

Battlegrounds mobile india has banned 336 000 players for cheating game crosses 48m downloads

PUBG, PUBG Mobile, PUBG Mobile India, iOS version, BGMI iOS version, Battlegrounds Mobile India iOS version launch, Battlegrounds Main version, Battlegrounds Main version release date, Beta tester, BGMI, battleground mobile india download, battleground mobile india release date, Battlegrounds Mobile India APK download, BGMI OBB download links, battle ground mobile india, bgmi launch date in india, battleground mobile india early access, Battlegrounds Mobile India, India, bgmi early access, PUBG Mobile India download, battleground mobile india apk, apk, bgmi download

PUBG Mobile India's Indianised version Battlegrounds Mobile India (BGMI) was launched for Android users on July 2. In a new development, the Sout Korean game developer Krafton has now said that it has banned over 3,36,000 players for using illegal programs to gain an advantage in some form.

బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ షాకింగ్ నిర్ణ‌యం.. నిషేధం అమలు..

Posted: 08/10/2021 09:21 PM IST
Battlegrounds mobile india has banned 336 000 players for cheating game crosses 48m downloads

ప‌బ్‌జీ గేమ్ గురించి తెలిసిన వాళ్ల‌కు బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌బ్‌జీ బ్యాన్ త‌ర్వాత దేశీయ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈ యాప్ అచ్చుగుద్దిన‌ట్లు ప‌బ్‌జీ లాగానే ఉంటుంది. ప‌బ్‌జీ గేమ్ విడుద‌లైన‌ప్పుడు యూత్ అంతా ఆ గేమ్‌కు ఎలా అడిక్ట్ అయ్యారో అంద‌రికీ తెలుసు. పబ్‌జీ బ్యాన్‌తో చాలామంది నిరాశ‌కు గుర‌య్యారు.

ఆ త‌ర్వాత రీసెంట్‌గా బ్యాటిల్‌గ్రౌండ్స్ యాప్‌ను రిలీజ్ చేయ‌డంతో.. కోట్ల మంది ప్లేయ‌ర్లు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. 5 కోట్ల డౌన్ః లోడ్స్ కు చేరువ‌లో ఉంది ఈ యాప్‌. ఇప్ప‌టికే 48 మిలియ‌న్ల డౌన్‌లోడ్స్ అయ్యాయి. 50 మిలియ‌న్ డౌన్‌లోడ్స్ అవ్వ‌గానే.. ప్లేయ‌ర్లకు స్పెష‌ల్ రివార్డ్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ క్రాఫ్ట‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు యాప్‌లో నిషేధిత ప్రోగ్రామ్‌ల‌ను ఉప‌యోగించి.. చీట్ చేస్తూ గేమ్‌లో అడ్వాంటేజ్ పొందేందుకు కొంద‌రు ప్లేయ‌ర్లు ప్ర‌య‌త్నించిన‌ట్టు కంపెనీ గుర్తించింది.

దీంతో.. అలా గేమ్‌లో చీట్ చేసిన 3,36,736 మంది ప్లేయ‌ర్లను క్రాఫ్ట‌న్ కంపెనీ బ్యాన్ చేసింది. ఆ యూజ‌ర్లు గేమ్‌ను మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోకుండా.. ఇన్‌స్టాల్ చేసుకోకుండా శాశ్వ‌తంగా బ్యాన్ చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. జులై 30 నుంచి ఆగ‌స్టు 5 వ తారీఖు మ‌ధ్య ప్లేయ‌ర్ల మీద నిఘా పెట్టిన కంపెనీ.. స‌ద‌రు యూజ‌ర్లు చీట్ చేస్తున్న‌ట్టు గుర్తించింది. దీంతో ఆయా యూజ‌ర్ల‌ను వెంట‌నే బ్లాక్ చేసేసింది. ఇప్ప‌టికే ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ఈ యాప్ అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే ఐవోఎస్ యూజ‌ర్ల‌కు కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు క్రాఫ్ట‌న్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. విడుద‌ల తేదీని మాత్రం ఇంకా క‌న్ఫ‌మ్ చేయ‌లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banned users  battlegrounds mobile india  bgmi  Krafton  technology  

Other Articles