Teenmaar Mallanna issues strong warning to CM KCR సీఎం కేసీఆర్ పై తీన్మార్ మల్లన్న ధ్వజం..

Teenmaar mallanna reacts on police raids on his qnews office

Teenmaar Mallanna, Q News Office, Police Raids, CM KCR, Srinivas Goud, Corruption, Rameshwar rao, Youtube channel, Telanagana, politics, Crime

Teenmaar Mallanna Reacts on Police Raids at his Q News Office, alleges the Ruling TRS party wantedly wants to stop q news, as this channel is bringing many corrupted Issues to the notice of Telangana people. He demands the police raids to be conducted in CM KCR and his Corrupted Friends offices and houses.

ITEMVIDEOS: సీఎం కేసీఆర్ పై తీన్మార్ మల్లన్న ధ్వజం.. పాపం పరాకాష్టకు చేరిందని వ్యాఖ్య

Posted: 08/05/2021 12:40 PM IST
Teenmaar mallanna reacts on police raids on his qnews office

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ కు చెందిన యూట్యూబ్ చానెల్ క్యూ న్యూస్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయంలోని కంపూటర్ల హార్డ్ డిస్క్ లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనను తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దాడులకు పాల్పడ్డిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ప్రియాంకతోపాటు సహోద్యోగి చిలక ప్రవీణ్ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంపై తీన్మార్ మల్లన్న స్పందించారు. పోలీసులు తీసుకెళ్లిన హార్డ్‌డిస్క్‌లలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాపం పరాకాష్టకు చేరిందని.. అందుకనే ప్రశ్నించే గొంతులను ఆయన ప్రభుత్వం అణచివేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం అవినీతిని ఎత్తిచూపే తమ కార్యాలయాలపై దాడులు చేస్తే లాభం లేదని అన్నారు.

ప్రభుత్వంతో కలసి అవినీతికి తెరలేపుతున్న బడా బాబుల ఇళ్లతో పాటు ప్రగతి భవన్ లోపల.. ఫామ్ హౌజ్ లోపల పోలీసులు దాడులు చేస్తే.. విస్తుపోయే విషయాలు తెలుస్తాయని మల్లన్న అరోపించారు. మీ ప్రభుత్వం పాలన అవినీతి రహితంగా ఉండివుంటే తామెందుకు ప్రశ్నిస్తామని నిలదీశారు. ‘యుద్ధం మిగిలే ఉంది.. 7200’ పేరుతో హన్మకొండలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లన్న.. పోలీసు కేసులకు భయపడబోనని అన్నారు. దాడుల నేపథ్యంలో త్వరలోనే తనను అరెస్టు కూడా చేస్తారని, అయినా తాను బెదరబోనని తేల్చిచెప్పారు. ఈ నెల 29న అలంపూర్‌లో తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్టు మల్లన్న తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles