'Allegations Serious if Reports Correct': SC పెగసెస్ అంశం నిజమే అయితే తీవ్రంగా పరిగణిస్తాం: సుప్రీంకోర్టు

Allegations serious if media reports are correct supreme court on pegasus row

Supreme Court Pegasus, Supreme Court Pegasus petition, Supreme Court Pegasus row, Supreme Court Pegasus allegations, Supreme Court, Project Pegasus, Narendra Modi, Amit Shah, BJP Parliamentary party, National politics, Crime

The Supreme Court, while hearing a clutch of petitions, including those filed by the Editors Guild of India, seeking a special probe into the Pegasus spyware scandal involving allegations that opposition leaders, journalists and others were targets of snooping, said “the allegations are serious if the media reports correct”.

పెగసెస్ అంశం నిజమే అయితే తీవ్రంగా పరిగణిస్తాం: సుప్రీంకోర్టు

Posted: 08/05/2021 04:09 PM IST
Allegations serious if media reports are correct supreme court on pegasus row

దేశంలోని ప్రముఖులు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్ల ట్యాపింగ్ లో ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ఒ గ్రూప్ సంస్థ రూపోందించిన పెగసెస్ స్పైవేర్ అంశం పత్రికలలో వచ్చినట్లు నిజమే అయితే తీవ్రంగా పరిగణిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కోంది. ఈ స్పైవేర్ ను దేశానికి ముప్పు కలిగించే అసాంఘిక శక్తులపై వినియోగించేందుకు బదులు దేశంలోని పాత్రికేయులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలపై వినియోగించడంపై దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

పెగసెస్ అంశంమై జాతీయ దినపత్రికలలో వచ్చిన కథనాలు నిజమే అయితే దానిని తీవ్రమైన చర్యగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పెగాసెస్ స్పైవేర్ ను ప్రభుత్వం ఉపయోగించిందన్న అరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ అప్ ఇండియా సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్ లతో పాటు పలువురు దాఖలు చేసిన 9 పిటీషన్లను న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ల విచారణ చేపట్టింది.

పెగాసస్ అంశంపై లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. అయితే, విచారణ ప్రారంభించేందుకు ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని పేర్కోన్నారు. 2019లోనే పెగసస్​ వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం పొందే ప్రయత్నం జరిగిందా? అనేది తెలియదు. కొందరు తమ ఫోన్లు హ్యాకింగ్​కు గురయ్యాయని చెబితే.. అది టెలిగ్రాఫ్​ చట్టం కిందకు వస్తుంది. ఆ ప్రకారమే ఫిర్యాదులు చేయాలి అని ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై విచారణకు, వాదనలకు కావాల్సిన బలమైన ఆధారాలు, మెటీరియల్ ను మాత్రం పిటిషనర్లు సేకరించలేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఎంతో విషయ పరిజ్ఞానం ఉండి కూడా ఆ వివరాలను ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. ప్రభావవంతమైన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారని 2019లోనే ఆరోపణలు వచ్చాయని జస్టిస్ రమణ గుర్తు చేశారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా కచ్చితమైన సమాచారాన్ని సేకరించారా? లేదా? అనే విషయం తనకు తెలియదన్నారు. ఒకవేళ తమ ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదనీ ప్రశ్నించారు. ఫోన్లు హ్యాక్ అయిన‌ట్లు చెబుతున్న కొంద‌రు.. ఎందుకని క్రిమిన‌ల్ కేసును దాఖ‌లు చేయాల‌ని పిటీషన్లలో పేర్కోన్నారని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శ్నించారు.

పిటిషనర్ల తరఫున అడ్వొకేట్, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి పెగాసస్ ప్రవేశిస్తోందని, ప్రజల గోప్యత, గౌరవానికి భంగం వాటిల్లుతోందని, భారత గణతంత్ర వ్యవస్థ విలువలపై దాడి అని అన్నారు. ఈ స్పైవేర్​ను ఎవరు కొనుగోలు చేశారు.. దాని హార్డ్​వేర్​ ఎక్కడ పెట్టారు.. ఈ కేసులో ప్రభుత్వం ఎఫ్​ఐఆర్​ ఎందుకు నమోదు చేయలేదు అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానమివ్వాలని కపిల్ సిబల్ కోరారు. ఈ వ్యవహారంపై స్పందించేలా.. కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని సీజేఐని కోరారు  సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, అడ్వొకేట్ ఎంఎల్ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ , కొందరు జర్నలిస్టులు పెగాసస్ అంశంపై విచారణ కోరుతూ పిటిషన్లు వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles