mRNA vaccines could cure cancer in a few years ఎంఆర్ఎన్ఏ వాక్సీన్ శాస్త్రీయతతో క్యాన్సర్, ఎయిడ్స్ కు చెక్..

After covid 19 vaccine moderna to use mrna to fight flu hiv and cancer

Yale, university of arizona cancer center, ugur sahin, mRNA, National Geographic, kariko, BioNTech, Moderna, Oncologist

The next mRNA miracle might be closer than you imagine. More than 150 new mRNA vaccines and therapies are being developed, says Buranyi. BioNTech, which developed Pfizer’s coronavirus vaccine, has seven in the pipeline; Moderna has nine.

ఎంఆర్ఎన్ఏ వాక్సీన్ శాస్త్రీయతతో క్యాన్సర్, ఎయిడ్స్ కు చెక్..

Posted: 08/04/2021 04:04 PM IST
After covid 19 vaccine moderna to use mrna to fight flu hiv and cancer

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో అమెరికాలో మద్యం బాబులు సీసాలకు సీసాల మద్యాన్ని లాగించేస్తున్నారని.. అయితే మద్యం సేవించడం కారణంగా వీరు ఏకంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని కూడా ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. నార్త్ మెస్టరన్ మెడిసిన్ కు చెందిన అంకాలజిస్టులు ఈ విషయాన్ని నిర్థారించారు. తమ దేశంలోని మద్యం తీసుకునేవారిలో క్యాన్సర్ లక్షణాలను కనిపించాయని, దీంతో మద్యంతోనూ క్యాన్సర్ వచచే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిందరూ తప్పనిసరిగా ఎంఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సీన్ ను తీసుకోవాలని.. కరోనా వాక్సీన్ తోనే క్యాన్సర్ కూడా ఖతం అవుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఔనా నిజమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమైనా ఇది ముమ్మాటికీ నిజం. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు సిద్ధం చేసిన ఎం ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌.. ఎప్పుడో 20 ఏండ్ల క్రితం 9/11 తర్వాత అంత్రాక్స్ దాడుల నేపథ్యంలో బీజం పడినట్లుగా తెలుస్తున్నది. 9/11 తరువాత తమ సైన్యంపై జీవశాస్త్రపరంగా వైరస్ తో దాడి చేస్తే.. దానిని ఎదుర్కోనేందుకు అమెరికా ఆరోజుల్లోనే సిద్దం అయ్యిందని.. దీంతోనే పెంటగాన్స్ డిఫెన్స్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డీపీఆర్‌ఏ) మసాచుసెట్స్ కు చెందిన కంపెనీ మోడెర్నాకు ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టు ఇచ్చిందన్నది వాస్తవం.

కాగా, ఇవాళ అదే శాస్త్రీయత ఆధారంగానే ఎం ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను నిరోధించిన తర్వాత క్యాన్సర్ ను చంపడానికి దాదాపు సిద్ధంగా ఉంది. ఎం ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ఆధారంగా క్యాన్సర్ వ్యాక్సిన్ బీఎన్‌టీ111 ఫేజ్-2 తొలిసారిగా ఒక క్యాన్సర్ రోగిపై పరీక్షించారు. కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించేందుకు వినియోగిస్తున్న వ్యాక్సిన్లతోనే క్యాన్సర్లకు కూడా చెక్ పెట్టవచ్చునంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రకం వ్యాక్సిన్ తో ఓరోఫారింజియల్‌ క్యాన్సర్‌, సైర్వైకల్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, లివర్‌ క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, వివిధ ట్యూమర్లను తొలగించేందుకు అందుబాటులోకి రానున్నాయి.

ఎం ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ మన శరీరంలోని కణాలను కరోనా వైరస్ వంటి చిట్కాతో ప్రోటీన్‌లను తయారు చేయమని ఆదేశిస్తుంది. ఈ ప్రోటీన్ తయారైన వెంటనే మన కణాలు దానిని విచ్ఛిన్నం చేస్తాయి. గుర్తించబడిన ప్రోటీన్లు మన కణాల ఉపరితలంపై కనిపించడం ప్రారంభిస్తాయి. మన రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్లను గుర్తించి వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేస్తుంది. భవిష్యత్‌లో కరోనా వైరస్‌ సోకినట్లయితే మన శరీరం వైరస్ ను గుర్తించి మన రక్షణ కణాలు వాటిని చంపుతాయి. అదేవిధంగా, క్యాన్సర్ విషయంలో కూడా ఎం ఆర్‌ఎన్‌ఏ టీకా మన శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles