Another NDA ally demands probe into Pegasus row పెగాసెస్ పై దర్యాప్తుకు బీజేపికి మరో మిత్రఫక్షం డిమాండ్

To bjp s embarrassment another nda ally jitan manjhi demands probe into pegasus row

Pegasus case, Hindustani Awam Morcha (Secular), Jitan Ram Manjhi, Nitish Kumar, Nitish Kumar BJP, Nitish Kumar Pegasus, Pegasus snooping india list, Pegasus latest news, BJP Modi Pegasus, Pegasus row, patna, parliament, NDA, JPC,house, Pegasus row, NDA ally, Nitish Kumar, JDU, Parliament houses, JPC, Amit Shah, PM Modi, National Politics

In embarrassment for the ruling BJP, after Bihar Chief Minister Nitish Kumar, another NDA ally from Bihar, Hindustani Awam Morcha (Secular) chief Jitan Ram Manjhi has now demanded a probe into the Pegasus snooping row.

బీజేపికి మరో మిత్రఫక్షం షాక్.. పెగాసెస్ పై దర్యాప్తుకు డిమాండ్

Posted: 08/03/2021 04:07 PM IST
To bjp s embarrassment another nda ally jitan manjhi demands probe into pegasus row

పెగాసస్‌ కుంభకోణం’ పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తున్న క్రమంలో.. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వరుసగా పది రోజుల నుంచి పార్లమెంటు ఉభయసభల్లో సమావేశాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. ముందుగా పెగాసస్ కుంభకోణంపై పార్లమెంటు ఉబయసభల్లోనూ చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో నిజానిజాల నిర్థారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుస్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణకు అదేశించాలని డిమాండ్ చేస్తున్నాయి.

పెగాసెస్ కుంభకోణం నేపథ్యంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీజేపికి నిన్న స్వపక్షానికి చెందిన మిత్రపక్షం నుంచి కూడా ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్‌) పార్టీకి చెందిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఈ మేరకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని ఎలాగోలా కప్పిపుచ్చుకుందామని అని అనుకుంటున్న తరుణంలో మరో మిత్రపక్షం కూడా అలాంటి డిమాండ్ నే చేయడం బీజేపికి ఇబ్బందికర పరిణామాలను తెచ్చిపెట్టింది. దేశంలోని రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్ కాల్ లపై నిఘా పెట్టడంపై విచారణ జరిపించాల్సిందేనని అన్నారు.

తాజాగా అదే బిహార్ రాష్ట్రానికి చెందిన ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీ అయిన హిందుస్తానీ అవామ్ మోర్చ (సెక్యూలార్) పార్టీ అధినేత జితన్ రామ్ మాంఘీ కూడా పెగసెస్ పై విచారణకు జరపించాలన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు తీవ్ర అవరోధంగా మారిన ఈ పెగసెస్ వివాదంపై విచారణ జరగాలని అన్నారు. గత పది రోజులుగా వరుసగా వాయిదా పడుతున్నాయంటే.. అందుకు కారణం.. ఓ సిరియస్ వివాదంపై విచారణ జరపించాలన్న డిమాండ్. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు ఆటంకం కలగకుండా విచారణ జరపించడమే సముచితమని ఆయన అన్నారు. ఇక దేశప్రజలకు కూడా ఎవరు ఎవరి ఫోన్ కాల్ పై నిఘా పెడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles