మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ప్రధాన నిందితుడ్ని అదుపులోకి తీసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఇప్పటికే 50 రోజులుగా సమగ్ర విచారణ జరిపిన సీబిఐ అధికారులు.. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సునీల్ యాదవ్ అనే ప్రధాన నిందితుడ్ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్యకేసులో చార్జిషీటును న్యాయస్థానంలో సమర్పించేందుకు అన్ని సిద్దం చేసుకున్న తరుణంలో సునీల్ యాదవ్ పులివెందుల లోని ఇంటికి తాళం వేసి పరారైన విషయం తెలిసిందే.
వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన ఇంటి వాచ్ మన్ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయన్న వార్తల నేపథ్యంలో అదృశ్యమైన సునీల్ యాదవ్ ను ఎట్టకేలకు సీబిఐ పట్టుకుంది. వాచ్ మన్ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్, కిరణ్ సోదరుడు సునీల్ కుమార్ యాదవ్ ను సీబిఐ విచారించింది.
వీరితో పాటు కిరణ్ కుమార్ యాదవ్ తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్ వ్యాపారి గువ్వల గంగాధర్, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులను విచారించిన సీబీఐ.. రంగయ్య నుంచి సేకరించిన కీలక సమాచారం మేరకు వివేకా హత్యకేసులో ముగ్గురికే ప్రమేయముందని కూడా తేల్చింది. ఈ కేసులో ప్రత్యక్షసాక్షి వాచ్ మెన్ రంగయ్య.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి పేర్లను అనుమానితులుగా వ్యక్తం చేయడంతో వీరిలో ఎవరు ప్రధాన నిందితుడన్న విషయాన్ని కూడా విచారించింది సీబిఐ. దీంతో సునిల్ యాదవ్ అరెస్టుకు రంగం సిద్దం చేసింది.
కాగా వైఎస్ వివేక హత్యకేసులో తన పేరు ప్రధాన నిందితుల జాబితాలో తెరపైకి రావడంతో.. వెనువెంటనే ప్లేటు ఫిరాయించిన సునీల్ యాదవ్.. హైకోర్టును ఆశ్రయించారు. సీబిఐ అధికారులు విచారణ పేరుతో తనను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ధర్డ్ డిగ్రీ పద్దతులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఆ తరువాతి రోజునే ఆయన అదృశ్యమయ్యాడు. తన ఇంటికి తాళం వేసిన కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ తన కుటుంబంతో పాటు కనిపించకుండాపోయాడు. దీంతో సీబిఐ అధికారులు ఆయనన గోవాలో వున్నాడని తెలుసుకుని అక్కడే అదుపులోకి తీసుకున్నారు,
వైఎస్ వివేక హత్యకేసులో సునీల్ యాదవ్ ను అరెస్టు చేయడం, కోర్టులో ప్రవేశపెట్టే ప్రక్రియపై అధికారులు ప్రస్తుతం అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద హత్య కేసులో విచారణ జరుపుతోన్న సీబీఐ అధికారులకు పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ అని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. సునీల్ యాదవ్ తన కుటుంబంతో కలిసి గోవాకు పారిపోకముందు పలు సార్లు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more