Alcohol linked to nearly 750,000 cancer cases in 2020 మద్యంపానం కూడా కాన్సర్ కారకమే: అధ్యయనం

Alcohol linked to nearly 750 000 cancer cases in 2020 new research shows

Alcohol, Cancer, Americans, Lancet Oncology, Dr. David Odell, LIver cancer, esophageal cancer, Breast cancer, Northwestern Medicine

Doctors are sounding the alarm over research showing a link between drinking alcohol and cancer. More than 700,000 new cancer cases were linked to alcohol consumption in 2020 — a time when many Americans reported drinking more.

తస్మాత్ జాగ్రత్తా: మద్యంపానం కూడా కాన్సర్ కారకమే: అధ్యయనం

Posted: 08/03/2021 05:02 PM IST
Alcohol linked to nearly 750 000 cancer cases in 2020 new research shows

కొందరికి మందు అంటే మహా ఇష్టం. ప్రతీ రోజూ కనీసం రెండు పెగ్గులు పడాల్సిందే. అయితే ఈ రెండు పెగ్గులే తమ మరణానికి దారి తీసేలా చేస్తున్నాయని ఎంత మందికి తెలుసు. దాదాపుగా ఎవరూ ఊహించని విషయం తాజా అధ్యయనాల్లో బయటపడింది. రోజు రెండు పెగ్గులు తీసుకుంటే వారు ప్రాణాంతమైన వ్యాధుల బారిన పడాల్సివస్తుంది. ఔనా నిజమేనా.. గతంలో డాక్టర్లు ప్రతీ రోజు కొద్దిగా మద్యం సేవించడంలో తప్పులేదని అనేవాళ్లు కదా.? అంటారా.? కానీ మారుతున్న కాలం.. అంతకుమించి మారుతున్న శారీరిక శ్రమ నేపథ్యంలో వ్యాధులు కూడా అనేకం పుట్టుకోస్తున్నాయి.

మధ్యం కోసం భార్యల మెడలోంచి పుస్తెలతాడును తీసుకెళ్లి తాగే మందుబాబులు వున్నారు. నిద్రాహారాలు లేకుండా అయినా వుంటారు కానీ.. మధ్యం లేకపోతే మాత్రం అస్సలుండలేరు. అయితే తాజాగా జరిగిన ఓ అద్యయంలో తేలిన సారాంశం మాత్రం మద్యం ప్రియులకు షాకింగ్ న్యూసే. అదేంటి అంటే.. మద్యం తాగితే క్యాన్సర్ వస్తుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్మోకింగ్ చేస్తేనే కదా క్యాన్సర్ రావాల్సింది.. మద్యం సేవిస్తూనే వస్తుందా.? అంటే తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన అధ్యయనం ప్రకారం ఇది ముమ్మాటికీ నిజమని డాక్టర్లు చెబుతున్నారు. మద్యం సేవించడానికి, క్యాన్సర్ కి సంబంధం ఉందని తేల్చారు వైద్యులు,

2020లో ఏడు లక్షలకు పైగా క్యాన్సర్ కేసులను పరిశీలించగా, అవన్నీ కూడా మద్యపానంతో సంబంధం కలిగున్నట్టు డాక్టర్లు గుర్తించారు. అయితే కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోమ్ నేపథ్యంలో గతంలో కన్నా అధికంగా అమెరికన్లు మద్యం సేవిస్తున్నారు. లాన్సెట్ అంకాలజీ జూలై 13 ఎడిషన్ లో ఓ అధ్యయనం పబ్లిష్ అయ్యింది. దాని ప్రకారం.. 2020లో వెలుగు చూసిన క్యాన్సర్ కేసుల్లో 4శాతానికి పైగా కేసులు మద్యం తాగడం వల్లే వచ్చాయని గుర్తించారు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకున్న వ్యక్తులు… ఆల్కహాల్ తో ముడిపడి ఉన్న క్యాన్సర్ల బారిన పడ్డారు. ఇక ప్రపంచవ్యాప్తంగా లక్ష కంటే ఎక్కువ కేసులు సగటు కంటే తక్కువగా మద్యం తీసుకున్న వ్యక్తులలో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంటోంది.

మద్యం ఒక చికాకు కలిగించే ద్రవం అని.. ఇది సేవించిన వారి నోరు, గొంతు, కడుపుని చికాకు పెడుతుందని క్యాన్సర్ వైద్యులు తెలిపారు. అయితే శరీరంలో కలిగే చికాకును మన శరీరం నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుందని, ఆ సమయంలో అధికంగా మద్యం సేవించేవారిలో మాత్రం ఈ చికాకులు నయం కాకుండా.. క్యాన్సర్ కు కారకంగా మారుతుందని అని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ లో ఆంకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ ఓడెల్ అన్నారు. గత సంవత్సరం చేసిన సర్వేలో దాదాపు మూడింట రెండు వంతుల మంది అమెరికన్లు తమ మద్యపానం అలవాటు పెరిగిందని చెప్పారు. ఇక రోజుకో పెగ్గుకే పరిమితం కావాల్సిన సమయం వచ్చింది.. మందుబాబులు మీ ఆరోగ్యం జరభద్రం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles