Passing law or ‘making papri chaat’, quips Derek O’Brien డెరిక్ ఒబ్రెయిన్ వ్యాఖ్యలపై అట్టుడికిన రాజ్యసభ

Derek o brien s papri chaat jibe on passing bills insult to people pm modi

Narendra Modi, BJP Parliamentary party meet, Derek O'Brien, Derek Obrien papri remark, passing bills, papri remark, Trinamool congress, Rajya Sabha, Pralhad Joshi, TMC, National politics

Prime Minister Narendra Modi, on Tuesday, condemned the derogatory tweet posted by Trinamool Congress (TMC) MP Derek O'Brien in which he likened the passage of bills in the Parliament to making 'papri chaat'. PM Modi's comment came during a BJP Parliamentary party meet earlier today.

టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వ్యాఖ్యలపై అట్టుడికిన రాజ్యసభ

Posted: 08/03/2021 12:29 PM IST
Derek o brien s papri chaat jibe on passing bills insult to people pm modi

తృణ‌మూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ రాజసభలో ప్రకంపనలు సృష్టించాయి. ఇవాళ ఉదయం బీజేపి పక్ష పార్లమెంటు సభ్యులతో జరిగిన సమావేశంలోనూ ఈ వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకున్నాయి, ఒబ్రెయిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్ర అభ్యంతరకరంగా వున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు.. చట్టసభలకు సభ్యులను ఎన్నుకుని పంపుతున్న దేశ ప్రజలను అవమానించడమేనని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు, పాపిడి చాట్ చేస్తున్నారా.? అని వ్యాఖ్యానించడం తీవ్ర అక్షేపనీయమని ప్రధాని అన్నారు.

పార్ల‌మెంటులో పేపర్లను చించడం, వాటిని విసిరివేయడం, చేసిన చర్యలకు కనీసం ప్రాయచిత్తం కూడా లేకపోవడం, క్షమాపణలు చెప్పకపోవడం వంటి ఘటను విపక్షపార్టీ సభ్యులకు సభపై వున్న గౌరవానికి దర్పణమని వివమర్శించారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ రాజ్యస‌భ‌ ప్రారంభం కాగానే టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌కు వ్య‌తిరేకంగా మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్ మూవ్ చేశారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఒబ్రెయిన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రి ప్ర‌హ్లాద్ జోషి డిమాండ్ చేశారు. ఇది మ‌న దేశానికి, పార్ల‌మెంట్‌కు అవ‌మానం అని ఆయ‌న అన్నారు.

ఇంతటి ఆజ్యానికి కారణమైన తృణముల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ చేసిన అంతటి ఘాటు వ్యాఖ్యలు సారాంశమేమిటంటే..  పార్లమెంటు ఉభయసభల్లో గత పది రోజుల వ్యవధిలో పలు బిల్లులు పాస్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా.. ఆ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అంత హడావిడిగా.. బిల్లులను పాస్ చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేసిన ఆయన చట్టసభల్లో బిల్లులు పాస్ చేస్తున్నారా లేక పాపిడి చాట్ చేస్తున్నారా అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండించారు. బిల్లుల‌ను ప్ర‌భుత్వం పాపిడి చాట్ త‌ర‌హాలో పాస్ చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మొద‌టి ప‌ది రోజుల్లో మోదీ స‌ర్కార్ 12 బిల్లుల‌ను పాస్ చేసిన‌ట్లు ఒబ్రెయిన్ ఆరోపించారు. అది కూడా ఏడు నిమిషాల్లోనే ఆ బిల్లులు పాసైన‌ట్లు తెలిపారు. మ‌రో వైపు విప‌క్ష స‌భ్యులు స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించారు. వాయిదా తీర్మానాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. వెల్ లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. రూల్ 267 కింద ఇచ్చిన వాయిదా తీర్మానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు చైర్మ‌న్ వెంక‌య్య తెలిపారు. మెజారిటీ స‌భ్యులు స‌భా నిర్వ‌హ‌ణ కోరుతున్నార‌ని, విప‌క్ష ఎంపీల తీరును స‌రిగా లేద‌ని అన్నారు. తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ‌ను ఆయ‌న 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles