COVID-19: India, UK to conduct clinical trials on Ashwagandha` కరోనా చికిత్సకు అశ్వగంధపై బ్రెజిల్ అద్యయనం

India u k to conduct clinical trials of ashwagandha for promoting recovery from covid 19

ashwagandha, London School of Hygiene and Tropical Medicine, Ayush, Covid recovery, Brazil, ashwagandha in covid recovery, ashwagandha benefits, Traditional herb,foreign institution, UK

Traditional herb Ashwagandha will be administered to 2,000 randomly selected people in Leicester, Birmingham and London to find out whether this herb helps in faster recovery from Covid-19. UK's London School of Hygiene and Tropical Medicine has entered into an agreement with the ministry of Ayush to conduct this study on Ashwagandha's impact on Covid recovery.

కరోనా చికిత్సకు అశ్వగంధపై బ్రెజిల్ అద్యయనం

Posted: 08/02/2021 07:25 PM IST
India u k to conduct clinical trials of ashwagandha for promoting recovery from covid 19

భారత్ కు చెందిన ప్రాచీన ఔషధానికి ఇన్నాళ్లకు ప్రపంచఖ్యాతి దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఎదుర్కోంటున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను  రక్షింరుకోవడంలో అశ్వగంధ ఔషధం తెరపైకి వచ్చింది. కరోనా రోగులు కోలుకోవడంలో, మహమ్మారి నుంచి రక్షణ కల్పించడంలో అశ్వగంధ ఎలా పనిచేస్తుందన్నదానిపై ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ), యూకేకు చెందిన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ (ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం) సంయుక్తంగా అధ్యయనం చేయనున్నాయి.

యూకేలోని మూడు నగరాల్లో 2వేల మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు రెండు సంస్థలు ఒప్పందం చేసుకొన్నాయి. ఈ విషయాన్ని ఆయుష్‌ శాఖ ఆదికారికంగా వెల్లడించింది. మూడు నెలల పాటు ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వెయ్యి మందికి అశ్వగంధ ఇస్తారు. మరో వెయ్యి మందికి ఎలాంటి ఔషధం ఇవ్వకుండా పరీక్షిస్తారు. రెండు గ్రూపుల్లో రోగ నిరోధక శక్తి, వైరస్‌ను తట్టుకొనే శక్తిపై అధ్యయనం చేస్తారు. ఈ ట్రయల్స్‌ విజయవంతం అయితే కరోనా చికిత్సకు సంబంధించి అశ్వగంధకు శాస్త్రీయత లభిస్తుంది.

ఆయుర్వేదంలో గొప్ప ముందడుగు అవుతుంది. అశ్వగంధ భారత సంప్రదాయ ఔషధం. ఇది శక్తినిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మిగతా ఔషధాలతో పోల్చితే సులువుగా లభిస్తుంది. భిన్న రకాల రుగ్మతలను అశ్వగంధ దూరం చేస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది కరోనాపై ఎలా పనిచేస్తుందన్న విషయంలో ఆయుష్‌ ఒక విదేశీ సంస్థతో కలిసి అధ్యయనం నిర్వహించడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashwagandha  covid recovery  Ayush  Traditional herb  Brazil  foreign institution  UK  

Other Articles