Nitish Kumar demands probe into Pegasus issue పెగాసెస్ పై దర్యాప్తుకు జేడీయూ డిమాండ్

Bihar cm nitish kumar calls for probe into pegasus spyware row

Pegasus case, Nitish Kumar, Nitish Kumar BJP, Nitish Kumar Pegasus, Pegasus snooping india list, Pegasus latest news, BJP Modi Pegasus, Pegasus row, patna, parliament, NDA, JPC,house, Pegasus row, NDA ally, Nitish Kumar, JDU, Parliament houses, JPC, Amit Shah, PM Modi, National Politics

Bihar chief minister Nitish Kumar on Monday demanded an investigation into the alleged snooping using the Pegasus spyware. It is the first time an NDA ally has supported the opposition’s demand to probe into the Pegasus row.

బీజేపికి షాక్.. పెగాసెస్ పై దర్యాప్తుకు ఎన్డీయే పక్షం డిమాండ్

Posted: 08/02/2021 08:46 PM IST
Bihar cm nitish kumar calls for probe into pegasus spyware row

పెగాసస్‌ కుంభకోణం’ పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తున్నది. వరుసగా పది రోజుల నుంచి పార్లమెంటు ఉభయసభల్లో సమావేశాలు జరగనీయకుండా ఈ విపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. ముందుగా పెగాసస్ కుంభకోణంపై పార్లమెంటు ఉబయసభల్లోనూ చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో నిజానిజాల నిర్థారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుస్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణకు అదేశించాలని డిమాండ్లు వున్నాయి.

ఇక ఇప్పటికే పెగాసెస్ కుంభకోణం నేపథ్యంలో బీజేపి పశ్చిమ బెంగాల్ పక్షనేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు, ఐఏఎస్ అధికారిపై నోరు జారిన క్లిప్పింగులపై దర్యాప్తు జరిపేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఆదేశించారు. కాగా, విపక్షాల డిమాండ్‌కు దన్నుగా స్వపక్షం నుంచి కూడా డిమాండ్‌ రావడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్‌) పార్టీకి చెందిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నుంచే ఈ డిమాండ్‌ రావడం విశేషం.

‘ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి ఇలాంటివి చేయకూడదు. మొత్తం విషయాన్ని బహిరంగపరచాలి’ అని నితీష్‌ కుమార్‌ అన్నారు. ఈ అంశాన్ని దర్యాప్తు జరుపాలా? అని ప్రశ్నించగా.. వాస్తవానికి జరుగాలని నితీష్‌ సమాధానమిచ్చారు.‘చాలా రోజులుగా టెలిఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ జరుగుతున్నది. ఈ విషయం పార్లమెంటులో లేవనెత్తారు. మీడియాలో వార్తా నివేదికలు వచ్చాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చర్చించి పరిశీలించాలి. మొత్తం విషయాన్ని బహిరంగపరచాలి’ అని సీఎం నితీష్‌ కుమార్‌ మీడియాతో అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 17 మీడియా సంస్థల కన్సార్టియం నివేదికల తర్వాత గత నెలలో చెలరేగిన ఈ వివాదం.. భారతదేశంలో భారీ రాజకీయ వివాదంగా మారింది. పార్లమెంటులో చర్చ కోసం విపక్షాలు చేతులు కలిపాయి. వర్షాకాల సెషన్‌ మొత్తం ఇదే వ్యవహారంతో తుడిచిపెట్టుకుపోయేట్లుగా ఉన్నది. చట్టవిరుద్ధమైన అంతరాయమేమీ జరగలేదని మాత్రమే ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేసింది. అయితే, పార్లమెంటు ఉభయ సభల్లో ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pegasus row  NDA ally  Nitish Kumar  JDU  Parliament houses  JPC  Amit Shah  PM Modi  National Politics  

Other Articles