"Eat More Beef": Meghalaya BJP Minister గొడ్డు మాంసం తినాల‌ని బీజేపీ మంత్రి పిలుపు

Bjp minister wants people to eat more beef than chicken or mutton

assam cow protection bill, conrad sangma, meghalaya cow bill, beef, himanta biswa sarma, Meghalaya BJP Minister, sanbor shullai Eat More Beef, sanbor shullai Meghalaya, Meghalaya BJP, sanbor shullai Beef, BJP Beef, Sanbor Shullai, minister beef, meghalaya cow bill, assam cow protection bill, BJP, Beef, Meghalaya, Crime

BJP minister in the Meghalaya government Sanbor Shullai encouraged the people of the state to eat more beef than chicken, mutton and fish, dispelling the apprehension that his party was against it. Mr Shullai, said everybody was free to eat whatever they want in a democratic country.

గొడ్డు మాంసం తినాల‌ని ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ మంత్రి

Posted: 07/31/2021 07:01 PM IST
Bjp minister wants people to eat more beef than chicken or mutton

గోవ‌ధ‌కు బీజేపీ వ్య‌తిరేకం అన్న భావ‌న‌ను తొలగించేందుకు కృషి చేస్తున్నాన‌ని మేఘాల‌య మంత్రి స‌నోబ‌ర్ షుల్లాయి పేర్కొన్నారు. గ‌త వారం మంత్రిగా ప్ర‌మాణం చేసిన స‌నోబ‌ర్.. గొడ్డు మాంసం తినాల‌ని మేఘాల‌య ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. చికెన్, మ‌ట‌న్, చేప‌ల కంటే అధికంగా గొడ్డు మాంసం ప్ర‌జ‌లు తినేందుకు ప్రోత్స‌హిస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో బీజేపీ గోవధపై నిషేధం విధిస్తుందనే భావన తొలగిపోతుంది అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప్ర‌జాస్వామ్య దేశంలో ఎవ‌రికీ న‌చ్చిన ఆహారం వారు తినొచ్చు అని చెప్పారు.

అసోం ప్ర‌భుత్వం తీసుకొచ్చే కొత్త ఆవు చ‌ట్టంతో మేఘాల‌య‌కు ప‌శువుల ర‌వాణా చేసే విష‌యంలో ఎలాంటి ప్ర‌భావం చూప‌కుండా.. ఆ రాష్ర్ట సీఎం హిమంత బిశ్వా శ‌ర్మ‌తో మాట్లాడుతాన‌ని మంత్రి స‌నోబ‌ర్ తెలిపారు. స‌రిహ‌ద్దులో మ‌న రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు అసోం వాసులు వేధిస్తే మ‌నం కూడా క‌చ్చితంగా స్పందించాల‌న్నారు. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అయితే తాను హింస‌ను ప్రోత్స‌హించ‌ను అని మంత్రి పేర్కొన్నారు. మ‌న ప్ర‌జ‌ల్ని ర‌క్షించుకునేందుకు పోలీసులు ముందుండి అసోం పోలీసుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌న్నారు.

అయితే మిజోరం – అసోం సరిహ‌ద్దు విష‌యంలో మిజోరం పోలీసులు త‌మ ప్రాంత ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకునేందుకు ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని మంత్రి సనోబ‌ర్ ప్ర‌శంసించారు. స‌రిహ‌ద్దులో మేఘాలయ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకునేందుకు మ‌న పోలీసులు వెనుకంజ‌లోనే ఉన్నార‌ని విమ‌ర్శించారు. కానీ ఇప్పుడు స‌మ‌యానికి అనుగుణంగా పోలీసులు వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇప్పుడు ఒక వేళ శత్రువులు మ‌న ఇంటికి వ‌స్తే.. వారు మ‌న కుటుంబంపై దాడి చేస్తారు. అదే స‌మ‌యంలో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం మ‌నం కూడా శ‌త్రువుల‌తో పోరాటం చేయాలి. ఈ విధంగానే స‌రిహ‌ద్దులో కూడా పోరాటం చేయాల‌ని మంత్రి స‌నోబ‌ర్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanbor Shullai  minister beef  meghalaya cow bill  assam cow protection bill  BJP  Beef  Meghalaya  Crime  

Other Articles