Encounter in Kashmir; 2 intruders shot dead జమ్మూలో ఎన్ఐఏ తనిఖీలు.. ఇద్దరు చోరబాటుదార్ల హతం

Two pakistani intruders were shot dead by bsf in ferozepur of punjab

punjab, jammu and kashmir, border security force, RAJOURI, BSF, pulwama, Tarn Taran, Ferozepur, Thehkelan, Amarkot, Two Pakistani intruders, Samba district, BSF, Drone activity in Jammu Kashmir, drone shot down in Jammu, Pakistan, Terror attack foiled, drone shot down, Jammu police, LIne of control, Jammu Kashmir

Two Pakistani intruders were shot dead by the Border Security Force along the International Border in Punjab's Ferozepur on July 30th. The Border Security Force Punjab Frontier in a statement said that the intruders were shot at 8:48 pm on Friday.

అక్రమ చొరబాట్లకు యత్నించిన ఇద్దరు పాకిస్థానీయుల హతం

Posted: 07/31/2021 11:39 AM IST
Two pakistani intruders were shot dead by bsf in ferozepur of punjab

దేశంలో ఉగ్రదాడులకు ముష్కరమూకలు కొత్తరకం పంథాను ఎంచుకున్నాయి. డ్రోన్ల ద్వారా భారత స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి తర్వాత.. తరుచూ అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్రోన్లు సంచరించడం కలవరానికి గురిచేస్తోంది. జమ్మూకశ్మీర్ లో నెలరోజుల వ్యవధిలో ఏకంగా పదకొండు డ్రోన్లు సంచరించాయని అంటే వారి పంథను అర్థం చేసుకోవచ్చు. డ్రోన్లపై కాల్పులు జరుపుతున్న భారత భద్రతా బలగాలు ఇటీవల ఐదు కిలోల ఐఈఢీ కలిగిన డ్రోన్ ను నేలకూల్చారు. ఆ తరువాత నుంచి వారం రోజుల వరకు మిన్నకుండిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. రెండు రోజల క్రితం ఏకంగా మూడు డ్రోన్లతో భారత స్థావరాలపై నిఘా పెట్టారు.

ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ 14 చోట్ల సోదాలు నిర్వ‌మిస్తున్న‌ది. రెండు కేసులకు సంబంధించిన ఆ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద ఉన్న ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే ముస్తాఫాకు చెందిన మ‌రో కేసులోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ది. సోఫియాన్‌, అనంత‌నాగ్‌, బ‌నిహ‌ల్‌తో పాటు సుంజ‌వాన్ లో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ రెయిడ్స్ చేస్తోంది. జూన్ 27వ తేదీన జ‌రిగిన డ్రోన్ దాడిలో ఇద్ద‌రు ఐఏఎఫ్ ద‌ళ సిబ్బంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే.

అదే సమయంలో అటు పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దర్ని భారత సైన్యం కాల్చిచంపింది. తర్న్ తరాన్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు శుక్రవారం రాత్రి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. బీఎస్ఎఫ్ బలగాలు కాల్చిచంపాయని ఓ అధికారి తెలిపారు. సరిహద్దు వద్ద రాత్రి 8.48 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయని ఆయన పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారులను అడ్డుకుని పదేపదే హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు.

దీంతో ముప్పును పసిగట్టిన బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమై.. కాల్పులు జరిపాయని అధికారి తెలిపారు. భిఖివింద్ సబ్ డివిజన్ ఖల్రా గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ 103 బెటాలియన్‌కు చెందిన సిబ్బంది థె కలాన్ బోర్డర్ అవుట్ పోస్ట్ (బీఓపీ) సమీపంలో భారత వైపు ముళ్ల కంచె, జీరో లైన్ మధ్య అనుమానాస్పదంగా కదలికను గమనించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

బీఎస్ఎఫ్ దళం హెచ్చరిస్తున్నా చొరబాటుదారులు లొంగిపోకుండా తిరిగి పాకిస్థాన్‌వైపు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో బిఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు అక్కడికక్కడే మరణించారు. వారి వద్ద నుంచి రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వారు ఎవరు అన్నదానిపై భద్రతా దళాలు విచారణ జరుపుతున్నాయి. ఇంకా వీరితో పాటు ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles