Millets-based diet can help manage blood glucose levels: study ‘షుగర్’కు మిలెట్స్ తో చెక్.. ఇక్రీసాట్ చెప్పింది గుడ్ న్యూస్.!

International space station knocked out of position as new russian science lab malfunctions

millets, diabetics, blood sugar, ICRISAT study, NIN, millets and sugar, Type-II diabetics, science news

A new study has shown that eating millets reduces the risk of developing type-2 diabetes and helps manage blood glucose levels. It indicated the need to have appropriate meals with millets for diabetic and pre-diabetics as well as for non-diabetics as a preventive approach to keep the disease at bay.

మధుమేహానికి మిలెట్స్ తో చెక్.. ఇక్రీసాట్ చెప్పింది గుడ్ న్యూస్.!

Posted: 07/30/2021 06:37 PM IST
International space station knocked out of position as new russian science lab malfunctions

డయాబెటీస్ తో బాధపడుతున్నవారి సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతోంది. ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడంతో ప్రారంభమయ్యే వీరి కష్టాలు.. రాత్రి పూట సాధ్యమైనంత మితంగా అసలు తిన్నామా.? లేదా.? అన్నంత తక్కువగా తినడం.. ఎక్కడికి వెళ్లినా.. వీరు ముందుగా పరిశీలించేది వాష్ రూమ్ లు వున్నాయా.? లేదా.? అన్న విషయం అని అందరికీ తెలుసు. ఇక ఈ విషయమై అనేక జోకులు కూడా పుట్టుకోచ్చాయి. ఏరా.. ఫోలో మని పోతున్నావ్.. షుగర్ వచ్చిందా.? అంటూ గేలి చేసే మిత్రులనుంచి తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం అయ్యాయి.

ఒక్కసారి వస్తే పోదు అనడానికి ఇదేమైనా షుగరా..? బిపీ.? అని అనేవాళ్లుకు ఇప్పుడు ధీటుగా సమాధానం చెప్పవచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మధుమేహం కూడా మాయమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని అంత‌ర్జాతీయ మెట్ట పంటల ప‌రిశోధ‌నాకేంద్రం (ఇక్రిసాట్) ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు తాము తీసుకునే ఆహారంలో క్రమంగా తృణధాన్యాలు (మిలెట్స్) జోడిస్తే చాలు. ఔనా అని ఆశ్చర్యపోతున్నా ఇది ముమ్మాటికీ నిజమని అధ్యయనం వెల్లడించింది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో క్రమం తప్పకుండా తృణధాన్యాలను జోడించి తీసుకుంటే షుగర్ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చునని తమ అధ్యయనం తేలిందని ఇక్రిసాట్ అధికార వర్గాలు తెలిపాయి. తృణధాన్యాలను చేర్చడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చూసుకోవచ్చునని అధ్యయనకారులు తెలిపారు. ఇక్రీసాట్ సహా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)తోపాటు మరో ఐదు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. 11 దేశాల్లో జరిగిన పరిశోధనల ఆధారంగా జరిగిన ఈ అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది.

తృణధాన్యాల ప్రభావం మధుమేహంపై ఎలా ఉంటుందన్న నేపథ్యంలో శాస్త్రీయంగా అన్ని అధ్యయనాలను సమీక్షించి పరిశోధించగా ఈ విషయం వెల్లడైందని ఇక్రిశాట్‌ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఎస్‌.అనిత తెలిపారు. అదెలా అంటే.. తృణ ధాన్యాలను ఆహారం గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ శాతం 12 నుంచి 15 శాతం వరకు (భోజనానికి ముందు, తర్వాత) తగ్గుతుందని తెలిసింది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు డయాబెటిస్‌ వచ్చినప్పటి కంటే రాకముందు స్థాయికి తగ్గిపోయినట్టు గుర్తించారు. ప్రీ డయాబెటిక్ లో ఉన్నవారి హెచ్‌బీఏ1 సీ (హీమోగ్లోబిన్‌కు అతుక్కున్న గ్లూకోజ్‌) మోతాదుల్లోనూ  17 శాతం తగ్గుదల నమోదైందన్నారు. ఈ వివరాలను ఫ్రాంటీయర్స్‌ ఇన్‌ న్యూట్రీషన్‌ జర్నల్‌ సంచికలో ప్రచురితమయ్యాయని తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : millets  diabetics  blood sugar  ICRISAT study  NIN  millets and sugar  Type-II diabetics  science news  

Other Articles