Centre lied in Parliament over deaths due to oxygen shortage ఆక్సిజన్ కొరతతో ఒక్కరూ చనిపోలేదనడంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు..

No deaths due to oxygen shortage in second wave completely false satyendar jain

covid-19, oxygen, concentrators, delhi health minister, satyendra Jain, shiv sena, sanjay Raut, sambit patra, KC Venugopal, Congress, Rajya sabha, lack of oxygen, oxygen shortage in states, covid second wave, Centre, Parliament, states, coWin, Union Territories, National Politics

A day after the Centre said there were no deaths due to lack of oxygen during the second Covid-19 wave, Delhi Health Minister Satyendar Jain on Wednesday called it "completely false" and said that "many deaths occured due to oxygen shortages in Delhi and many other places across the country".

ఆక్సిజన్ కొరతతో ఒక్కరూ చనిపోలేదనడంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు..

Posted: 07/21/2021 06:59 PM IST
No deaths due to oxygen shortage in second wave completely false satyendar jain

కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో ఎవరూ చనిపోలేదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్రం చెబుతున్నట్టు ఆక్సిజన్ కొరత లేకుంటే ఆసుపత్రులు కోర్టుకు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించాయి. దేశం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని ఆసుపత్రులు, మీడియా ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాయని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ అన్నారు. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఎందరో కొవిడ్ బాధితులు ఆక్సిజన్ కొరతతో మరణించారని అన్నారు. కానీ కేంద్రం మాత్రం ఒక్కరు కూడా చనిపోలేదని అబద్ధాలు చెబుతోందని దుయ్యబట్టారు.

కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ నిర్వహణ విషయంలో చేతులెత్తేసిన కేంద్రం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి బూటకపు ప్రకటనలు చేస్తోందన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రాణవాయువు అందుబాటులో లేక అనేక రాష్ట్రాల్లో ఎంతోమంది చనిపోయారని అన్నారు. దేశంలో ఆక్సిజన్ కోరత, కరోనా చికిత్సకు అవసరమైన రెమిడీసివీర్ మందును అమెరికా, చైనా సహా పలు దేశాలు దేశానికి సెకండ్ వేవ్ సమయంలో ఎందుకు పంపించాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వ్యంగోక్తులు విసిరారు. ప్రపంచదేశాలు ఇచ్చిన అక్సిజన్ తీసుకున్న కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పడం విడ్డూరంగా వుందని అన్నారు.

ఆక్సిజన్ కొరక కారణంగా మరణించిన వారి బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని ఇప్పుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వాస్తవానికి దూరంగా కేంద్రం పారిపోతోందోని అన్నారు. బహుశా ఇదంతా పెగాసస్ ప్రభావం కావొచ్చని రౌత్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ మండిపడింది. కొవిడ్ మరణాల డేటాను కేంద్రం తయారుచేయలేదని, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన డేటానే కేంద్రం వెల్లడించినట్టు ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా బాధితులు చనిపోయినట్టు రాష్ట్రాలేవీ తమ నివేదికల్లో పేర్కొనలేదని, అదే విషయాన్ని కేంద్రం చెప్పిందని ఆయన వివరించారు. కాగా రాజ్యసభలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం ఆక్సిజన్ కొరతతో దేశంలో ఒక్కరూ చనిపోలేదని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles