Excited dog sends uwner flying as it runs to meet him శునకం అత్యుత్సాహం: యజమానికి శాపం.?

S lap dog delighted pooch sends owner flying as it runs to meet him

Watch video, Dog trips man, Animal Videos, dog, china, ziejaing province, Lin, Pets latest news, funny video, pets funny video, viral video, video viral

An overenthusiastic dog sent its master flying after it bounded over to greet him in the morning – and skidded on the wet ground. The incident happened at a house in Huzhou in China's Zhejiang Province when the man, Mr. Lin, in a white T-shirt walked into the car park with a cigarette in his mouth.

ITEMVIDEOS: శునకం అత్యుత్సాహం: యజమానికి శాపం.?

Posted: 07/20/2021 05:34 PM IST
S lap dog delighted pooch sends owner flying as it runs to meet him

 జంతు ప్రేమికులకు తమ చుట్టూ పెంపుడు జంతువులు తిరుగుతుంటే వారిలో అదో రకమైన కొత్త శక్తి పునికి పుచ్చుకుంటుంది. అవి ఎంతో ప్రేమగా తమను చూసి తోకను అడిస్తూ రావడంతో వాటికి ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో యజమానులు కూడా వాటితో సరదాగా అడుతుంటారు. ఈ కోవలో ముందువరుసలో వుండేవి మాత్రం విశ్వాసమున్న శునకాలే అంటే అతిశయోక్తి కాదు. అవెప్పుడూ ఫన్ క్రియేట్ చేయడం కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. కాకపోతే రీసెంట్ గా తన పెంపుడు కుక్క కారణంగా ఓ వ్యక్తి దారుణమైన ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాడు.

యజమానులు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా.. బయట నుంచి ఇంటికి వచ్చినా ముందుగా వాహనాన్ని పసిగట్టి ప్రేమతో అరుస్తూ స్వాగతం పలికేవి శునకాలే. చైనాలోని జెజియాంగ్ లో ఉండే లిన్ కు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆయన నోట్లో సిగరెట్ పెట్టుకుని దానిని కాలుస్తూ పార్కింగ్ లాట్ లో వున్న తన కారు వైపుకు వెళ్తున్నాడు. ఇంతలో తన యజమానిని బయటకు రావడం చూసిన శునకం.. పరుగుపరుగున వచ్చి యజమాని పైకి ఎగరాలనుకుంది.

కానీ తడిసిన నేల కారణంగా అది కాస్తా స్లిప్ అయ్యింది. దీంతో వేగాన్ని అపుకోలేక తన యజమాని కాలును ఢీకొనింది. అంతే నిటారుగా వున్న చెట్టంత మనిషీ ఒక్కసారిగా కిందపడ్డాడు. అనూహ్యమైన ఘటనలో కాలికి గట్టి దెబ్బతగలడంతో అక్కడే కూలబడిపోయిన యజమాని మూలుగుతున్నాడు. ఎంతో ప్రేమగా యజమానిని చేరుందుకు వచ్చి శనకం ఒక్కసారిగా కామ్ అయ్యింది. తన మూలంగానే తన మజమాని కిందపడిపోయాడన్న విషయం అర్థమైనట్టుగా.. ఆయన చుట్టూనే తిరిగింది.

వీడియో పోస్టు నెట్టింట్లో పోస్టు చేయడంతో అనేక మంది అనేక రకాల కామెంట్లు పెట్టారు. అయితే అనూహ్యఘటన నుంచి కోలుకున్న తరువాత యజమాని మాట్లాడుతూ.. తనకు శునకంపై ఎలాంటి కోసం లేదని చెప్పాడు. తాను కూడా వీడియోను చూశానని, అది తన వేగాన్ని అదుపుచేసుకోలేక పోవడంతో పాటు కాళ్లు జారడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని, అయితే ఈ విషయం తనకు ముందు తెలియలేదని, వీడియో చూసిన తరువాత విషయం అర్థమైందని అన్నాడు లిన్. ఈ ఘటనతో శనకాలు మనుషుల సంతోషంతో పాటు భాధను కూడా ఇట్టే గహ్రిస్తాయని మరోమారు రుజువైందని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog trips man  Animal Videos  dog  china  ziejaing  Lin  funny video  viral video  

Other Articles