Raj Kundra sent to police custody till July 23 రాజ్ కుంద్రాకు ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీ

3 day police custody for shilpa shetty s husband raj kundra in adult film case

Raj Kundra, Mumbai Police, Porn Case, Raj Kundra News, Raj Kundra News Today, Porn Case News, Raj Kundra Latest News, Pornography Case News, Raj Kundra sent to Police Custody, Raj Kundra Police Custody, Raj Kundra arrested, shilpa shetty husband arrested, shilpa shetty husband case, raj kundra porn racket, Crime

Businessman Raj Kundra, husband of actor Shilpa Shetty, used to deal with pornographic videos through an app called "Hotshots", the Mumbai Police told a court a day after arresting him. He was sent to police custody till Friday.

పాడు చిత్రాల కేసు: ఈ నెల 23 వరకు రాజ్ కుంద్రాకు పోలీస్ కస్టడీ

Posted: 07/20/2021 04:24 PM IST
3 day police custody for shilpa shetty s husband raj kundra in adult film case

బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాకు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది ముంబై న్యాయస్థానం. పోర్నోగ్రఫీ (నీలిచిత్రాలకు) సంబంధించిన  కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ ఆయనను న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా ఈ నీలిచిత్రాలకు సంబంధించిన వ్యవహారంలో కీలక సూత్రధారి అని.. అది నిరూపించేందుకు తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలు బలంగా వున్నాయిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో మరిన్నీ వివరాలను అతని నుంచి రాబట్టేందుకు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో న్యాయస్థానం మూడు రోజుల పాటు రాజ్ కుంద్రాను పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే ఇప్పటివరకు రాజ్ కుంద్రా అరెస్టుకు సంబంధించిన అంశంలో ఆయన కుటుంబం నుంచి కానీ, శిల్పాశెట్టి కుటుంబం నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించి నీలిచిత్రాల కేసు విషయమై పిర్యాదు చేసింది. తానకు బాలీవుడ్ చిత్రాలలో అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ.. ఇప్పుడు ఫోర్న్ చిత్రాలలో నటించాలని ఒత్తిడి చేస్తోందని, తనకు ఇష్టం లేదని చెప్పగా బెదిరింపులకు పాల్పడుతోందని పిర్యాదులో పేర్కోంది. అమె పిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. ఐదు నెలలుగా పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి.

ముంబై పోలీసుశాఖ‌కు చెందిన ప్రాప‌ర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న‌ ఓ ముఠాను ప‌ట్టుకున్న‌ది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామ‌న్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియ‌లు తీశారు. ఈ కేసులో న‌టి గెహ‌నా విశిష్ట్ ను కూడా అరెస్టు చేశారు. అమె అరెస్టుతో నీలి చిత్రాల దర్శకుడు, వీడియోగ్రాఫర్ అయిన ఉమేశ్ కామత్ అనే వ్య‌క్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అత‌ను రాజ్ కుంద్రా వ‌ద్ద ప‌నిచేసేవాడు. ఉమేశ్ కామ‌త్ ను అరెస్టు చేసిన త‌ర్వాతే.. ఆ పోర్న్ రాకెట్ లో రాజ్ కుంద్రా పాత్ర ఉన్న‌ట్లు తేలింద‌ని పోలీసులు చెప్పారు.

కుంద్ర ఆఫీసు నుంచే వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా ఫైల్స్ ను విదేశాల‌కు పంపించి.. అక్కడి నుంచి యాప్ లో అప్ లోడ్ చేసేవాళ్లు. ఓటిటీ ఫ్లాట్ ఫామ్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని నమ్మించిన నవ యువ యాక్ట‌ర్ల‌ను పోర్న్ రాకెట్ గ్యాంగ్ వ‌ల‌వేసి ప‌ట్టుకుని.. ట్రాప్ లో చిక్కినవారితో అశ్లీల చిత్రాలు తీయించేవారు. ముంబైలోని వెస్ట్ మ‌లాడ్‌లో ఉన్న మాద్ ఏరియా బిల్డింగ్‌లో షూటింగ్ చేసేవాళ్లు. ఆ తరువాత వాటిని వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా విదేశాల‌కు పంపిస్తారు. అయితే భార‌తీయ చ‌ట్టాల నుంచి త‌ప్పించుకునేందుకు అశ్లీల చిత్రాల‌ను అక్క‌డి యాప్స్ లో అప్ లోడ్ చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh