Akali Dal say they will continue to protest against farm laws కొత్త సాగుచట్టాలను రద్దు చేయాల్సిందే: అకాలీదళ్ నిరసన

Akali dal stages protest against centre s farm laws outside parliament

New farm Laws, Shiromani Akali Dal, Farmers protest, Monsoon session, Parliament, Punjab Assembly Elections, Punjab, Politics

Shiromani Akali Dal (SAD) president Sukhbir Badal on Monday said his party along with alliance partner Bahujan Samaj Party (BSP) would continue to protest and demand a repeal of the three farm-related laws.

కొత్త సాగుచట్టాలను రద్దు చేయాల్సిందే: ప్లకార్డులతో అకాలీదళ్ నిరసన

Posted: 07/19/2021 07:26 PM IST
Akali dal stages protest against centre s farm laws outside parliament

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న పంజాబ్ కు చెందిన శిరోమణి అకలిదళ్ పార్టీ.. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్‌ వెలుపల శిరోమణి అకాలీదళ్‌ నిరసన తెలిపింది. సోమవారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ మాట్లాడుతూ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరుకుంటున్నారని, ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చినట్లు తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని తాము కోరుకుంటున్నామన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఎంపీ, కేంద్ర మాజీమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రైతుల మాట ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. ఇవాళ రైతులకు ఎవరు మద్దతిస్తున్నా.. రైతుల హక్కుల కోసం ఈ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సుమారు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు.

కాగా, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదోలుగుతూ.. కేంద్ర మంత్ర పదవిని కూడా త్యాజించిన శిరోమణి అకలీదళ్ పార్టీ.. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మాత్రం మరోమారు కేంద్రం ప్రభుత్వంతో దోస్తికి చేతులు కలిపింది. అంతేకాదు ఏకంగా కేంద్రమంత్రి పదవిని కూడా పోందిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ఆగస్ట్‌ 13 వరకు కొనసాగనున్నాయి. రైతుల నిరసనపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్‌ సింగ్‌ మన్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ గత నవంబర్‌ 26 నుంచి దేశ రాజధానికి సరిహద్దు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles