Monkey B virus caused first human death in China? చైనాలో మంకీ-బి వైరస్ తొలి మరణం..

China reports first human death from monkey b virus all you need to know

Monkey B virus, Monkey B virus cases, Monkey B virus death, What is Monkey B Virus, Monkey B virus case in China, Centre for Disease Control and Prevention, Macaque monkeys, Monkey B virus signs and symptoms, Explained Health, Crime

China has reported the first human infection case with Monkey B virus (BV) after a Beijing-based veterinarian was confirmed with the same a month after he dissected two dead monkeys in early March, according to China CDC Weekly.

చైనాలో మంకీ-బి వైరస్ తొలి మరణం.. మహమ్మారి ముప్పు లేదు..

Posted: 07/19/2021 06:44 PM IST
China reports first human death from monkey b virus all you need to know

ఉగ్రవాదులకు స్వర్గధామంలా పాకిస్థాన్ వుండగా.. వైరస్ లకు స్వర్ఘధామంలా చైనా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందకంటే యావత్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కరోనావైరస్ బలితీసుకుంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ పట్టణంలోని ల్యాబ్ లోనే పురుడు పోసుకుందని వార్తలు వినిపిస్తునే వున్నాయి. ఇప్పటికే రెండు దశలుగా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా... మూడో దశ కూడా వస్తుందన్న అందోళనలు నెలకొన్నాయి, అయితే ఈ అందోళనలు కోనసాగుతున్న క్రమంలోనే మరో వైరస్ కూడా చైనాలో పురుడు పోసుకుంది.

మంకీ బి వైర‌స్‌ బారిన పడిన ఓ వ్యక్తి మరణించడం చైనాలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే తొలి మరణం కావడంతో అందోళన మరింత పెరిగింది. ఓ 53 ఏళ్ల వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ఈ వైర‌స్ బారిన ప‌డి మృత్యువాత ప‌డ్డారు. ఈ ఏడాది మార్చిలో రెండు చ‌నిపోయిన కోతుల‌ను ముట్టుకోవ‌డం ద్వారా ఆయ‌న‌కు ఈ వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. నెల రోజుల త‌ర్వాత క‌డుపులో వికారం, వాంతులు మొద‌ల‌య్యాయి. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా.. మే 27న ఆయ‌న చ‌నిపోయారు. ఈ నేప‌థ్యంలో ఈ కొత్త వైర‌స్ ఏంటి? ఇది ఎంత ప్ర‌మాద‌క‌రం అన్న విషయాలను ఓ సారి పరిశీలిద్దాం.

మంకీ బి అనేది కొత్త‌గా పుట్టుకోచ్చిన వైరస్ కాదని తేలింది. తొలిసారి ఈ బీ వైర‌స్ కార‌ణంగా 1933లోనే ఓ లేబొరేట‌రీలో ప‌ని చేసే వ్య‌క్తి చ‌నిపోయారు. ఆ వ్య‌క్తిని ఓ కోతి క‌రిచింది. ఆ త‌ర్వాత దానిని నుంచి కోలుకున్నా.. కొన్ని రోజుల త‌ర్వాత జ్వ‌ర సంబంధ‌మైన వ్యాధి బారిన ప‌డ్డారు. మెల్ల‌గా అసెండింగ్ మైలిటిస్ (నాఢీ సంబంధిత‌) వ్యాధి ల‌క్ష‌నాలు క‌నిపించి, 15 రోజుల త‌ర్వాత మృత్య‌వాత ప‌డ్డారు. అయితే ఆయన చనిపోయినా.. ఆ తరువాత కూడా పరిశీలను కొనసాగాయి. దీంతో మంకీ బి వైరస్ సోకడం ద్వారా చనిపోయిన వ్యక్తిలో ఎ రకమైన లక్షణాలతో చనిపోయాడో కూడా అధ్యయాలు జరిగాయి.

అయితే మంకీ బి వైరస్ కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుంతుంది. కానీ ఇది కరోనా వైరస్ అంత వేగంగా సోకదు. ఇక గాలి ద్వారా అసలు సోకడు. ఇది ఒకరి నుంచి మరోకరికి నేరుగా తాక‌డం, వైర‌స్ సోకిన వ్య‌క్తి స్ర‌వాలు అవ‌త‌లి వ్య‌క్తిలోకి వెళ్ల‌డం ద్వారా మాత్రమే సోకుతుంది. 1933లో తొలిసారి ఈ మాకాక్యూ బి ఇన్ఫెక్ష‌న్ బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ 20 మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు. వీళ్ల‌లో ఐదుగురు గ‌త 12 ఏళ్ల‌లోనే చ‌నిపోయారు. వీళ్ల‌లో చాలా మంది కోతి క‌ర‌వ‌డం లేదా గీర‌డం లేదా చ‌ర్మంపై ఏర్ప‌డిన గాయం ద్వారా కోతి క‌ణ‌జాలం లేదా స్ర‌వాలు శ‌రీరంలోకి వెళ్ల‌డం ద్వారా ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు.

ఇది మ‌నిషికి సోకినప్పుడు ప్ర‌ధానంగా కేంద్ర నాఢీ వ్య‌వ‌స్థ‌పైనే దాడి చేస్తుంద‌ని అమెరికాకు చెందిన నేష‌న‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ మెడిసిన్ వెల్ల‌డించింది. దీని బారిన ప‌డి వాళ్ల‌లో 70 నుంచి 80 శాతం మంది మ‌ర‌ణించారు. వైర‌స్ సోకిన త‌ర్వాత 1-3 వారాల్లోపు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వీటిలో ప్ర‌ధానంగా ఫ్లు వైర‌స్ ల‌క్ష‌ణాలైన జ్వ‌రం, చ‌లి, కండ‌రాల నొప్పి, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి క‌నిపిస్తాయి. అయితే ఈ వైరస్ మహమ్మారిలా మారే అవ‌కాశాలు చాలా త‌క్కువ అని ప‌రిశోధ‌న‌లు తేల్చాయి. ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి అంత సులువుగా ఇది సోక‌దు. దీని కార‌ణంగా దీని వ్యాప్తి వేగం త‌క్కువే. దీంతో ఇది మ‌హ‌మ్మారిగా మారే అవ‌కాశాలు త‌క్కువ అని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh