Still looking for pigeons to deliver bail orders: SC అదేశాల తక్షణ అములకు సుప్రీం ‘ఫాస్టర్‌’ సేవలు

Cji nv ramana s innovation to ensure faster release of prisoners granted bail

CJI, NV. Ramana, innovation, FASTER, release, prisoners, granted, bail, supreme court, FASTER service, Justice NV Ramana, chief Justice of India, Bail orders, sumoto, Uttarpradesh, Crime

Chief Justice N V Ramana-led bench of the Supreme Court on Friday expressed concern that even in the era of internet and Information Technology boom, it seemed jail authorities are relying on ancient mode of communication through pigeons.

డిజిటల్ యుగంలోనూ అర్డర్ కాఫీ అందలేదా.?: సుప్రీం సీరియస్

Posted: 07/17/2021 11:33 AM IST
Cji nv ramana s innovation to ensure faster release of prisoners granted bail

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన అదేశాల ఆర్డర్‌ కాపీలు అందలేదన్న సాకుతో వాటిని అధికారులు అమలు చేయకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అదేశాల అర్డర్ కాఫీలను ఎంతో ముఖ్యమైనవిగా భావించిన అందుకోవాల్సిన అధికారులు వాటిని అందుకోలేదన్న కారణంగా అదేశఆలను అమలుపర్చడంలో తాత్సరం చేయడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఈ డిజిటల్‌ యుగంలోనూ సమాచార చేరవేతకు పావురాల కోసం ఆకాశం వంక చూడాల్సి వస్తున్నది’ అంటూ అసహనం వ్యక్తంచేసింది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను వెంటనే అమలు పర్చేందుకు ‘భద్రమైన, నమ్మకమైన, అధికారిక సమాచార వ్యవస్థ’ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సెంట్రల్‌ జైలులో ఉన్న 13 మంది ఖైదీలకు కోర్టు ఈ నెల 8న బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్డర్‌ కాపీలు అందలేని వారిని అధికారులు విడుదల చేయలేదు. దీనిని కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. తమ అదేశాలను ఆర్డర్ కాఫీలు అందలేదని అమలు పర్చకపోవడం చాలా దారుణం అని వ్యాఖ్యానించింది.

ఇకపై సుప్రీంకోర్టు అదేశాలను వెంటనే సంబంధిత అధికారులకు అందేలా చర్యలు తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. తాము ప్రతిపాదించిన సమాచార వ్యవస్థను ఫాస్టర్‌ (ఫాస్ట్‌ అండ్‌ సెక్యూర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌)గా అభివర్ణించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ.. దీని ఎలా ఏర్పాటు చేయాలన్నదానిపై రెండువారాల్లో వివరాలు తెలుపాలని సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్‌ను ఆదేశించింది. దీనికి సీనియర్‌ న్యాయవాది దుశ్యంత్‌ దవేను అమికస్‌ క్యూరీగా నియమించింది. దవేతో కలిసి పనిచేయాలని సెక్రెటరీ జనరల్‌కు సూచించింది. ఈ వ్యవస్థ రూపకల్పనలో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా సహాయం చేయనున్నారు.

మరోవైపు, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపర్చడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్‌ రమణ.. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాలపై అన్ని రాష్ర్టాలు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్నెట్‌ వసతి లేకపోతే వేగంగా సమాచార మార్పిడి కష్టమని అభిప్రాయపడ్డారు. ‘ఫాస్టర్‌’ వ్యవస్థను ఈ నెలలోనే అమలు చేస్తామన్నారు. జైళ్లు, జిల్లా కోర్టులు, హైకోర్టులకు వేగంగా సమాచారం అందేలా ఈ వ్యవస్థ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఇకపై న్యాయస్థానం నుంచి అదేశాల అర్డర్ కాఫీలు అందలేదన్న కారణాలు ఇకపై వినిపించకపోవచ్చునని న్యాయవాదులు పేర్కోంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles