'wobble' in Moon's orbit could cause record flooding: NASA వ‌ణుకుతున్న చంద్రుడు.. భారీ వరదల ముప్పు: నాసా

Nasa warns wobble in moon s orbit could cause record flooding on earth

NASA, Nasa Scientists, Universtity of Hawaii, Floods, Low Lying areas, raising sea levels, Bill nelson, orbital wobble, space sciencs

NASA scientists say a tiny “wobble” in the Moon’s orbit could cause catastrophic flooding in low-lying areas over the coming decade. A new study from NASA and the University of Hawaii warns that in the mid-2030s, low-lying coastal areas will experience rapidly increasing high-tide floods.

వ‌ణుకుతున్న చంద్రుడు.. భూమిపై భారీ వరదల ముప్పు: నాసా

Posted: 07/16/2021 07:50 PM IST
Nasa warns wobble in moon s orbit could cause record flooding on earth

అస్థిరంగా క‌దులుతున్న చంద్రుడితో భూమిపై ఉన్న తీర న‌గ‌రాల‌కు ముంపు ముప్పు త‌ప్ప‌ద‌ని అమెరిక‌న్ స్పేస్ ఏజెన్సీ నాసా తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌తోపాటు చంద్రుడి ఈ అస్థిర చ‌ల‌నం కార‌ణంగా స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతాయ‌ని నాసా ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. 2030వ ద‌శ‌కం మ‌ధ్య‌లో అమెరికాలోని తీర‌ప్రాంత న‌గ‌రాలు ముంపుకు గుర‌వుతాయ‌ని వాళ్లు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే అధిక ఆటుపోట్ల కార‌ణంగా కొన్ని న‌గ‌రాలు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నాయ‌ని తెలిపారు. నేష‌న‌ల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎన్ఓఏఏ) 2019లోనే ఇలాంటి 600 వ‌ర‌ద‌ల‌ను రిపోర్ట్ చేసిన విష‌యాన్ని నాసా గుర్తు చేస్తోంది.

ఈ అధ్య‌య‌నం తాలూకు ఫ‌లితాల‌ను నేచ‌ర్ క్లైమేట్ చేంజ్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. వ‌ర‌ద‌ల వెనుక ఉన్న ఖ‌గోళ కార‌ణాల‌ను విశ్లేషించ‌డంపైనే ఈ అధ్య‌య‌నం ప్ర‌ధానంగా దృష్టి సారించింది. దీని గురించి నాసా అడ్మినిస్ట్రేట‌ర్ బిల్ నెల్స‌న్ వివ‌రించారు. చంద్రుడి గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి, స‌ముద్ర మ‌ట్టాలు పెర‌గ‌డం, ప‌ర్యావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు ప్ర‌పంచంలోని తీర ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల ముప్పును పెంచుతున్నాయి. దీనికి సంబంధించి నాసా సీ లెవ‌ల్ చేంజ్ టీమ్ కీల‌క‌మైన స‌మాచారాన్ని అందిస్తోంది. ఈ స‌మాచారంతో మ‌నం వ‌ర‌ద‌ల కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణం, ప్ర‌జ‌ల జీవ‌నోపాధులు ప్ర‌భావితం కాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోగ‌లం అని నెల్స‌న్ చెప్పారు.

చంద్రుడు వ‌ణ‌కడం కొత్త విష‌యం ఏమీ కాద‌ని కూడా నాసా స్ప‌ష్టం చేసింది. 1728లోనే తొలిసారి ఇది క‌నిపించింది. దీనివల్ల చంద్రుడి గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తిపై చూపే ప్ర‌భావం, ప‌ర్యావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా స‌ముద్ర మ‌ట్టాలు పెరిగిపోతుండ‌టంతో క‌లిసి ఎలాంటి ప్ర‌భావం చూప‌బోతుంద‌న్న‌దే ఇక్క‌డ ముఖ్య‌మైన అంశం. చంద్రుడి క‌క్ష్య‌లో ఈ అస్థిర చ‌ల‌నం పూర్తి కావ‌డానికి 18.6 ఏళ్లు ప‌డుతుంది. ఇందులో తొలి భాగంలో భూమిపై ఆటుపోట్లు త‌క్కువ‌గా ఉండి, రెండో భాగంలో ఒక్క‌సారిగా పెరుగుతాయి. ఆ లెక్క‌న 2030వ ద‌శ‌కంలో మధ్య‌లో ఆటుపోట్లు పెరిగి ఇప్ప‌టికే స‌ముద్ర మ‌ట్టాలు పెర‌గ‌డం వ‌ల్ల అత‌లాకుత‌లం అవుతున్న తీర న‌గ‌రాల‌ను పూర్తిగా ముంచేసే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని నాసా ప‌రిశోధ‌కులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles