Next 100-125 days critical for averting 3rd wave, says govt ముంచుకోస్తున్న మూడవ దశ.. అప్రమత్తమైన కేంద్రం..

Next 125 days critical for averting 3rd wave haven t reached herd immunity yet govt

WHO, WHO Warns, WHO on COVID-19, WHO on Vaccines, Delta, Delta Plus, COVID-19 variant, COVID-19 Updates, COVID-19 news, COVID-19 information, COVID-19 in India, coronavirus, COVID-19 information, Coronavirus, Covid-19 news, WHO COVID-19 Updates, COVID-19 Delta Plus mutation, COVID-19 Delta variant, COVID-19 Live Updates, covid 3rd wave, covid 3rd wave in india, covid 3rd wave news, Niti Aayog, VK Paul, PM Modi

Niti Aayog member (health) VK Paul said the warning about the third wave of the Covid-19 pandemic which the WHO has recently issued is for the global situation, which indeed is reflecting the impact of the third wave. "Leaving North and South American regions of WHO, all other WHO regions are moving from good to bad and bad to worse.

ముంచుకోస్తున్న మూడవ దశ.. అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు సూచనలు

Posted: 07/17/2021 12:33 PM IST
Next 125 days critical for averting 3rd wave haven t reached herd immunity yet govt

దేశ ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్కులు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, చేతులు క్రమం తప్పకుండా వాష్ చేసుకోవాలని.. ఈ నిబంధనతోనే డెల్టా వేరియంట్ నుంచి తప్పించుకోగలమని నీతి ఆయోగ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు దేశాలను అతలాకుతలం చేస్తున్న డెల్టా వేరియంట్ దేశంలోనూ విజృంభించే అవకాశాలు వున్నాయిని అరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని తేల్చిచెబుతున్నారు.

ఇప్పటికే పలు దేశాల్లో థర్డ్ వేవ్‌ విజృంభన కోనసాగుతోందని, భారత్ లోనూ కేసుల పెరుగుదలకు అవే సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రపంచ అరోగ్య సంస్థ కూడా పరిగణిస్తోంది. దేశంలో మళ్లీ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత కొన్ని వారాలుగా చూస్తుంటే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.. డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్ల కేసులు ఇండియాలో రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో నీతిఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకేపాల్‌ మాట్లాడారు. కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు.

కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ఆంధప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. కఠిన నిబంధనలు అమలు చేసి మూడో దశ రాకుండా అడ్డుకోవాలన్నారు. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-టీకా విధానాన్ని మరింత విస్తరించాలని తెలిపారు. వైద్యరంగంలో మౌలికసదుపాయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్‌కు కరోనా ముప్పు తొలగలేదని అయితే.. వచ్చే మరో 100-125 రోజులు చాలా క్రిటికల్ అని కేంద్రం ప్రకటించింది.

థర్డ్ వేవ్ నుంచి పిల్లలు జాగ్రత్త..

పిల్లలు కరోనాబారిన పడే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌-19 నిబంధనలను పకడ్బందీగా పాటిస్తూ చిన్నారులను మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీకాలతో 95శాతం మరణాల రేటు తగ్గిందని వీకే పాల్ తెలిపారు. రెండో వేవ్‌లో కరోనా మరణాలను తగ్గించడంలో టీకాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని అన్నారు. రెండు డోసులు వేసుకొన్నవారిలో మరణాల రేటు 95 శాతం తగ్గిందన్నారు. ఒక్క డోసు వేసుకొన్నవారిలో 82 శాతం ఉందన్నారు. గడిచిన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 73 జిల్లాల్లో మాత్రమే రోజుకు 100 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covid 3rd wave  covid 3rd wave in india  covid 3rd wave news  Niti Aayog  VK Paul  PM Modi  

Other Articles