Is Sedition Law Still Necessary To Continue: SC ‘‘దేశద్రోహం ఐపీసీలోని 124-ఎ సెక్షన్‌ మనకు అవసరమా.?’’

Do you need the colonial law of sedition after 75 years of independence sc

Supreme Court, Sedition, Section 124 IPC, Constitutional validity of sedition law, Supreme court CJI, NV Ramana, British Used Sedition law To Suppress Our Freedom Movement,Is Sedition law needed after 75 years of independence?, Misuse of sedition law, National, Politics, crime

The Supreme Court expressed alarm at the rampant misuse of sedition law in the country. CJI NV Ramana also expressed reservation at continuing the use of the provision (Section 124A of IPC), inserted during the colonial era in 1870, purportedly to curb dissent.

దేశద్రోహం ఐపీసీలోని 124-ఎ సెక్షన్‌ మనకు అవసరమా.?: సుప్రీంకోర్టు

Posted: 07/15/2021 06:37 PM IST
Do you need the colonial law of sedition after 75 years of independence sc

బ్రిటీష్ కాలం నాటి దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్ల తరువాత కూడా దేశ‌ద్రోహ చ‌ట్టం అవసరం ఉందా.? ఈ స్వత్రంత భారతవనిలోనూ అలాంటి చ‌ట్టాలు అవ‌స‌ర‌మా అని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. వలసవాదుల కాలంనాటి చట్టం, ఇప్పుడు కూడా కొనసాగించడంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖ‌లైన పిటీషన్లను విచారిస్తూ న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది.

రాజద్రోహం చట్టం (ఐపీసీ సెక్షన్‌ 124-ఎ) చెల్లుబాటును పరిశీలిస్తామని స్పష్టం చేస్తూనే.. కేంద్రం నుంచి వివరణ కోరింది. ఆ చ‌ట్టాన్ని స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌పై వాడిన‌ట్లు కేంద్రానికి కోర్టు తెలిపింది. స్వాతంత్య్ర పోరాటాన్ని అణిచివేసేందుకు దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని బ్రిటీష‌ర్లు (ఐపీసీ సెక్షన్‌ 124-ఎ) తీసుకొచ్చారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మ‌హాత్మా గాంధీ, బాల్ గంగాధ‌ర్ తిల‌క్ లాంటి వారిపై ఆ కేసుల‌ను పెట్టార‌ని కోర్టు తెలిపింది. 75 ఏళ్ల స్వాతంత్య్రం త‌ర్వాత ఇలాంటి చ‌ట్టం అవ‌స‌ర‌మా అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ ఎస్‌జీ వోంబాట్కెరె.. ఐపీసీలోని 124-ఎ సెక్షన్ ను (దేశద్రోహం నేరం కింద కేసు) వ్యతిరేకిస్తూ.. అది రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులకు విఘాతం కలిగిస్తోందని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ సందర్భంగా దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తే అనేక పిటీష‌న్లు దాఖ‌లైన‌ట్లు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. అన్నింటినీ ఒకేసారి విచారిస్తామ‌ని కోర్టు తెలిపింది. ఆ చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తార‌న్న‌దే త‌మ ఆందోళ‌న అని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles