Maharashtra Man Wins $1 Million in Dubai Duty Free Raffle దుబాయ్ లాటరీలో జాక్ పాట్ కోట్టిన మరో భారతీయుడు.!

Maharashtra man purchases lottery ticket online wins 1 million in dubai duty free raffle

Dubai, dubai duty free, Dubai Duty Free Draw, Dubai Duty Free Draw Online, Dubai Duty Free Millennium Millionaire Draw, Dubai Duty Free Millennium Millionaire Draw Online, Ganesh Shinde, Mumbai, Thane, UAE, UAE Online Draw

An Indian citizen, who purchased his ticket online from Thane, won the $1 million first prize in the latest Dubai Duty Free Millennium Millionaire draw. On Wednesday, ticket number 0207, which was the chosen one in the 363rd Millennium Millionaire draw, belonged to a 36-year-old seaman, Ganesh Shinde.

దుబాయ్ లాటరీలో జాక్ పాట్ కోట్టిన మరో భారతీయుడు.!

Posted: 07/15/2021 05:26 PM IST
Maharashtra man purchases lottery ticket online wins 1 million in dubai duty free raffle

దుబాయ్ లాటరీల్లో భారతీయులకు అదృష్టం  కలిసివస్తోంది. నెల రోజుల వ్యవధిలో ముగ్గరు భారతీయులు దుబాయ్ లాటరీల పుణ్యమా అని కోటీశ్వరులయ్యారు. తొలుత ఓ భారతీయ వ్యక్తికి సుమారు ఆరవై కోట్ల రూపాయల లాటరీ దక్కడంతో ఆయన కోటీశ్వరుగయ్యాడు. ఇక ఆ తరువాత గతవారం రోజుల క్రితం కేరళకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ దుబాయ్ లాటరీలో తన స్నేహితులతో కలసి పెద్ద మొత్తంలో ఏకంగా ఆరు కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఇక ఇలా మన భారతీయులు ఒక ఏడాది కాలంలో ఏకంగా పదుల సంఖ్యలో దుబాయ్ లాటరీ టికెట్లు కోని కోటీశ్వరులు అవుతున్నారు.

తాజాగా మహరాష్ట్ర వాసికి భారీ లాటరీ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో మహరాష్ట్ర కు చెందిన గణేష్ షిండే 1 మిలియన్ డాలర్ల జాక్ పాట్ ను గెలుచుకున్నాడు. మన డబ్బులో అది అక్షరాల 7కోట్ల 45లక్షల రూపాయలు. మిలియనీర్ మిలీనియం సిరీస్ 363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం 0207కు ఈ ఫ్రైజ్ మనీ లభించింది. షిండే స్వస్ధలం మహరాష్ట్రలోని థానే. ప్రస్తుతం నావీలో పనిచేస్తున్నాడు. అతని వయస్సు 36 సంవత్సరాలు. 1999లో ప్రారంభమైన మిలియనీర్ మిలీనియం లాటరీని ఇప్పటివరకు 180 మంది భారతీయులు గెలుచుకోగా, షిండే లాటరీని గెలుచుకున్న 181వ వ్యక్తి కావటం విశేషం.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టిక్కెట్లను గణేష్ షిండే అన్ లైన్ లో కోనుగోలు చేయడం గమనార్హం. గణేశ్ షిండే ఒక్కడే కాదు భారత్ నుంచి అనేక మంది భారతీయులు అన్ లైన్ ద్వారా ఈ లాటరీ టికెట్లను కొనేందుకు పోటీపడుతుంటారు. రాపెల్ టిక్కెట్లను కోన్నవారిలో అత్యధికులు భారతీయులే అంటే అతిశయోక్తి కాదు. అధిసంఖ్యలో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి తమ లక్ ను చాలా మంది పరీక్షించుకుంటున్నారు. ఒక మిలియన్ డాలర్ల ఫ్రైజ్ మనీ రావటం పట్ల షిండే ఆనందం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్ధలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles