Mehul Choksi allowed to go back to Antigua for treatment మెడికల్ గ్రౌండ్ పై మెహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు

Mehul choksi granted interim bail on medical grounds by dominica hc

Mehul Choksi, Bail, Dominica High Court, fugitive Indian businessman, Fugitive diamond merchant, Gitanjali Group, nakshastra brands ltd, Nakshatra Brands Ltd., Punjab National Bank, National Bank fraud case

The High Court of Commonwealth of Dominica granted bail on medical grounds to wanted jeweller Mehul Choksi, accused in the Rs.13,500 crore fraud caused to the Punjab National Bank (PNB) and allowed him to travel to Antigua to seek treatment.

మెడికల్ గ్రౌండ్ పై మెహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు

Posted: 07/13/2021 02:52 PM IST
Mehul choksi granted interim bail on medical grounds by dominica hc

పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ప్రజల సోమ్మును రుణంగా పోంది ఏకంగా 13 వేల 500 కోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా ఎగొట్టి విదేశాలకు పారిపోయిన భారత వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి డొమినికా హైకోర్టులో ఊరట లభించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం మెడికల్ గ్రౌండ్స్ పై మాత్రమే చోక్సీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ నేపథ్యంలో ఆయన చికిత్స నిమిత్తం అంటిగ్వాకు వెళ్లే అవకాశాన్ని కూడా న్యాయస్థానం కల్పించింది.

అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చోక్సీకి మంజూరు చేసిన బెయిల్.. ఒక విధంగా భారత ఏజెన్సీ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఆయనకు బెయిల్ మంజూరైన విషయాన్ని ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ కూడా ధృవీకరించారు. ఔను మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. ఆయన అరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసిందని అన్నారు . అంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోతూ డొమినికా బీచ్ లో చోక్సీ పట్టుబడ్డాడు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ ఆయనపై డొమినికా పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో, మే 23 నుంచి ఆయన డొమినికా జైల్లో ఉన్నాడు. తాజాగా బెయిల్ లభించడంతో డొమినికా నుంచి అంటిగ్వా అండ్ బార్బుడాకు వెళ్లనున్నాడు. 2018లో ఇండియా నుంచి పారిపోయిన చోక్సీ అప్పటి నుంచి అంటిగ్వాలోనే ఉన్నాడు. తాను నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని, అంటిగ్వాలోని వైద్యుడిని సంప్రదించడం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును చోక్సీ కోరాడు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డొమినికా కోర్టులో చోక్సీ తరపున ప్రముఖ లాయర్ విజయ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles