photographer saves woman, who fell into sea చేపలు కోసం వచ్చి సముద్రంలో పడ్డ మహిళ..

Man saves woman from drowning at mumbai s gateway of india video goes viral

Watch video, photographer saves woman life at Mumbai, photographer saves woman life, Colaba police officials, Pallavi Munde, Gateway of India, Gulabchand Gond, photographer Gulabchand Gond, Gulabchand Gond Pallavi Munde, fish sassoon dock, Indian Navy, Gateway, Mumbai latest news, Crime

An alert photographer Gulabchand Gond at the Gateway of India saved the life of a 30-year-old woman Pallavi Munde who was sitting on the wall along the promenade on Monday morning and fell into the sea after she felt dizzy. The woman a resident of Khar had come to buy fish at Sassoon dock, said Colaba police officials.

ITEMVIDEOS: చేపలు కోసం వచ్చి సముద్రంలో పడ్డ మహిళ.. కాపాడిన ఫోటోగ్రాఫర్

Posted: 07/13/2021 01:19 PM IST
Man saves woman from drowning at mumbai s gateway of india video goes viral

ఓ మ‌హిళ చేపలు కొనడానికి వచ్చి సముద్రం వద్దకు వచ్చి అక్కడ సంద్రాన్ని చూస్తూ.. సముద్రం నీరు కు అడ్డుగా కట్టిన భారీ గోడపై కూర్చుంది. ఎంతో హాయిగా అనిపించినట్టు వుంది. హాయాగా కూర్చొని ఎంజాయ్ చేసింది. అయితే ఆకస్మాత్తుగా అమెకు సోషవచ్చి సముద్రంలో పడిపోయింది. మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని తాజ్ హోటల్ ఎదురుగా వున్న గేట్ వే అఫ్ ఇండియా వద్ద చోటు చేసుకుంది. అమె స‌ముద్రంలో పడిపోవడాన్ని గమనించిన ఓ ఫోటోగ్రాఫర్ వెంటనే సముద్రంలోకి దూకి అమెను ప్రాణాలను కాపాడాడు.

కొలాబా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని ఖార్ ప్రాంతానికి చెందిన ముఫై ఏళ్ల పల్లవి ముండే అనే మహిళ చేపలు కోనేందుకని ఇంటి నుంచి నిన్న ఉదయం బయలుదేరి ముంబై సముద్రతీరంలోని సాసూనే డాక్ వద్దకు వచ్చింది. ఎలాగో అక్కడి వరకు వచ్చిందని సరదాగా ముంబై గేట్ వే అఫ్ ఇండియా వద్ద సముద్రాన్ని చూస్తూ కొద్ది సేపు అస్వాధించింది. అలా సముద్రుడ్ని చూస్తూ.. హాయిగా కొద్ది సేపు గడిపిన ఆమెకు అనుకోకుండా సోషవచ్చింది. అంతే అకస్మాత్తుగా పట్టుతప్పి పడిపోయింది. తేరుకుని చూసేలోపు అమె సముద్రంలో పడిపోయింది.

అంతే కాపాడండీ అంటూ కేకలు వేసినా.. ఎవరికీ వినబడనంత ఎత్తు (20 ఫీట్లకు పైగా వున్న) గోడ అవరోధంగా వుంది. తన ప్రాణాలు సముద్రుడిలో కలిసిపోవాల్సిందే అనుకునే సమయంలో అమెను సముద్రంలోకి పడిపోతుండగా చూసిన స్థానిక ఫోటోగ్రాఫర్ గులాబ్ చంద్ గోండ్ హుటాహుటిన సముద్రంలోకి దూకి అమెను మునిగిపోకుండా కాపాడాడు. ఇంతలో మిగ‌లిన ప‌ర్యాట‌కులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బాధిత మ‌హిళ బయటకు తీసుకురావడంలో వారు లైఫ్ బెలూన్ వేయడంతో పాటు తాళ్లు వేశారు. తాళ్ల సాయంతో అమెను గొడకు మరోవైపు తీసుకువచ్చిన ఫోటోగ్రాఫర్ అమెను శ్రమించి బయటకు తీసుకురావడంలో విజయవంతమయ్యాడు. స‌కాలంలో స్పందించి ఆమె ప్రాణాలను కాపాడిన ఫోటోగ్రాఫ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప‌లువురు గులాబ్ చంద్‌ను అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : photographer  woman  Gateway of India  Fish  sassoon dock  colaba police station  Mumbai  Crime  

Other Articles