Madhu Yashki Goud fires on Sabitha, Sudhir Reddy సుధీర్ రెడ్డి, సబితారెడ్డిలపై తీవ్రస్థాయిలో మధుయాష్కీ ఫైర్

Congress senior leader madhu yashki goud fires on sabitha sudhir reddy

Madhu Yashki, Nizamabad Ex MP, Revanth oath taking ceremony, Gandhi Bhavan, Telangana pradesh congress, PCC publicity commitee chairman, Sabitha Indrareddy, Sudhir Reddy, TRS, BJP, Telangana, Politics

Congress Senior Leader, Former Nizamabad MP Madhu Yashki Goud fires on Sabitha Indra reddy and Sudhir Reddy and all those who intentionally deceived the congress and joined the Ruling TRS party for their personal agenda

ITEMVIDEOS: సుధీర్ రెడ్డి, సబితారెడ్డిలపై తీవ్రస్థాయిలో మధుయాష్కీ ఫైర్

Posted: 07/07/2021 03:57 PM IST
Congress senior leader madhu yashki goud fires on sabitha sudhir reddy

టీపీసీసీ నూతన కార్యవర్గం ఇవాళ పదవీ బాధ్యతలును అందుకుంది. పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా హైదరాబాదులోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సభలో నూతన కార్యవర్గ పిసిసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. అధికార పార్టీతో పాటు సొంత పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన తమ నేతలపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక తరమే ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అయ్యిందని దుయ్యబట్టారు. లక్ష కోట్ల రూపాయలను అక్రమంగా గడించిన కేసీఆర్.. నిరుద్యోగ యువతను మాత్రం పూర్తిగా మర్చిపోయారని ధ్వజమెత్తారు.

ఏడేళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, లక్షా 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వున్నా వాటిని భర్తీ చేయడానికి ఆయన ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులే పడలేదని దుయ్యబట్టారు. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం వద్ద నిధులు లేవు.. దళితులకు మూడెకరాల పోలం ఇచ్చేందుకు నిధులు లేవు.. అయితే సీఎం తన సొంత కొటారీగా వున్న ఆంధ్ర కాంట్రాక్టర్లకు, వారి పనులకు బిల్లులకు మాత్రం నిధులు ఫుల్ అని విమర్శించారు. ఈ ‘రావు’ కాలంలో ఏవీ రావని.. పాలకులకు పంచభక్ష పరమాన్నాలు.. ప్రజలకు ఎంగిలి మెతుకులు అన్నట్లు వ్యవస్థ తయారైందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భాగోతాలు అందరికీ తెలుసని... కాంగ్రెస్ భిక్షతోనే ఆయన హుడా ఛైర్మన్ పదవిని పొందారని చెప్పారు. హుడా ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఆంధ్ర నేత లగడపాటి రాజగోపాల్ తో కలిసి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 'రేవంత్ రెడ్డిపై చెప్పులేస్తామని నోరు జారుతావా సుధీర్ రెడ్డీ?' అంటూ మధు యాష్కి మండిపడ్డారు. 'నీ భాగోతం నాకు తెలియదా? నేను కూడా మలక్ పేట్ నుంచే వచ్చా' అని అన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డిని అడిగితే నీ భాగోతం మొత్తం బయటపెడతారని చెప్పారు.

ఇదే సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా మధు యాష్కి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్ నేతలు వున్నా వారిని పక్కనబెట్టి ఇంధ్రన్న గుర్తు చేసుకుని మీకు మంత్రి పదవిని కట్టబెట్టి.. ఆ తరువాత రాష్ట్ర హోం మంత్రిగా చేసి.. ఈ రాష్ట్రానికే మీ అంత ఎత్తు ఎవరూ ఎదగలేని మహిళా నేతగా చేస్తే.. అదే కాంగ్రెస్ పార్టీని కాదని వ్యక్తిగత స్వార్థంతో అధికార పార్టీతో కలుస్తారా.? అని ఆయన విమర్శించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కార్యకర్తలు అందరూ గట్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపి టీఆర్ఎస్ తో అందర్ బాహర్ అట ఆడుతోందని, ఇంట్లో దోస్తి, బయట కుస్తీ అన్న చందంగా వారి స్నేహం సాగుతోందని మదుయాష్కీ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles