Dilip Kumar, actor extraordinaire, dies at 98 బాలీవుడ్ నటుడు దిలిప్ కుమార్ కన్నుమూత

Dilip kumar bollywood s tragedy king dies at 98 after long illness

Dilip Kumar,Dilip Kumar dies,Top movies of Dilip Kumar,Hit movies of Dilip Kumar,Last Movie of Dilip Kumar,Birthday Day of Dilip Kumar,Illnessof Dilip Kumar,Dilip Kumar Contribution to Indian Cinema,Dilip Kumar passes away,Faisal Farooqui,Saira Banu,dilip kumar death,dilip kumar dead,dilip kumar tributes,dilip kumar obituary,dilip kumar demise,dilip kumar age,dilip kumar news,Dilip Kumar dies at 98,Dilip Kumar death

Veteran actor Dilip Kumar passes away at the age of 98, says Dr Jalil Parkar, the pulmonologist treating the actor at Mumbai's PD Hinduja Hospital. Born Mohammed Yusuf Khan in 1922 in Peshawar, now in Pakistan, he was known by the screen name of Dilip Kumar once he joined Bollywood in the 1940s.

నేలకొరిగిన నటశిఖరం: బాలీవుడ్ నటుడు దిలిప్ కుమార్ కన్నుమూత

Posted: 07/07/2021 11:05 AM IST
Dilip kumar bollywood s tragedy king dies at 98 after long illness

బాలీవుడ్ నటశిఖరం దిలీప్ కుమార్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ప్లూరల్ ఎఫ్యూషన్‏తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 98 ఏండ్ల వయస్సున్న దిలీప్ కుమార్ గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండ‌గా, ఆయ‌న‌కు ముంబైలోని హిందూజా దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

1922 డిసెంబర్‌ 11న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో దిలీప్‌ కుమార్‌ జన్మించారు. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. 1944 నుంచి 1998 వరకు చిత్రసీమను ఏలిన దిలీప్ కుమార్ ఉత్తమ నటుడిగా ఎనిమిది సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. 1994లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. సినీపరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది.

1993లో దిలీప్‌కు ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. 1998లో నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డుతో పాకిస్థాన్‌ ప్రభుత్వం సత్కరించింది. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా దిలీప్‌ కుమార్‌ సేవలు అందించారు. ఆయన మృతిపై బాలీవుడ్‌ పరిశ్రమతోపాటు, పలువులు ప్రముఖులు సంతాపం తెలిపారు.కాగా, కొద్ది రోజుల క్రితం ఆయ‌న ఇద్ద‌రు సోద‌రులు కరోనాతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles