SC notice to centre on cases under scrapped law ‘‘రద్దు చేసిన చట్టం-66ఏ కింద కేసులు ఎలా నమోదా.?’’

Shocking supreme court notice to centre on cases under scrapped law

Supreme court, Section 66A of IT Act, Central Government, Notices, Supreme Court, Section 66A, Information Technology Act, Shreya Singhal vs Union of India

The Supreme Court on Monday expressed shock and displeasure on being told that over 1,000 cases had been filed under Section 66A of the IT Act - a controversial law that allowed police to arrest people for posting "offensive" content online - since it was struck down seven years ago.

రద్దు చేసిన చట్టం-66ఏ కింద కేసులా.?: కేంద్రానికి సుప్రీం తాఖీదులు

Posted: 07/05/2021 06:25 PM IST
Shocking supreme court notice to centre on cases under scrapped law

ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టంలోని 66ఏ సెక్ష‌న్‌ను 2015వ సంవ‌త్స‌రంలో సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. 2000 సంవ‌త్స‌రంలో రూపొందించిన ఆ చ‌ట్టాన్ని ఇంకా కొన్ని కేసుల్లో న‌మోదు చేస్తున్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. పీపుల్ యూనియ‌న్ ఫ‌ర్ సివిల్ లిబర్టీస్‌(పీయూసీఎల్‌) దాఖలు చేసిన పిటిష‌న్‌ను కోర్టు విచారించింది. ఈ నేప‌థ్యంలో సుప్రీం ధ‌ర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐటీ యాక్ట్‌లోని 66ఏ సెక్ష‌న్‌ను ఎప్పుడో ర‌ద్దు చేశార‌ని, మ‌రెందుకు ఆ సెక్ష‌న్ ప్ర‌కారం ఇంకా కేసులు న‌మోదు చేస్తున్నార‌ని కోర్టు ప్ర‌శ్నించింది.

ఈ ప‌రిణామాలు దారుణంగా ఉన్నాయ‌ని సుప్రీం విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ రోహింట‌న్ నారీమ‌న్‌, కేఎం జోసెఫ్‌, బీఆర్ గ‌వాయిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌డుతూ.. ర‌ద్దు అయిన ఆ చ‌ట్టం గురించి దేశంలో ఉన్న అన్ని పోలీసు స్టేష‌న్ల‌కు తెలియ‌జేయాల‌ని త‌న తీర్పులో కేంద్రాన్ని ఆదేశించింది. 2015 మార్చి 24వ తేదీన ఓ తీర్పులో ఐటీయాక్ట్‌లోని 66ఏ సెక్ష‌న్‌ను రాజ్యాంగ‌వ్య‌తిరేక‌మ‌ని కోర్టు పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఆ చ‌ట్టం కింద‌ దేశ‌వ్యాప్తంగా 745 కేసులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles