Woman gets stuck under elephant statue ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య ఇరుక్కుపోయిన మహిళా

Viral video woman gets stuck under elephant statue at gujarat temple

woman stuck under elephant statue, woman stuck under elephant idol, gujarat woman stuck in temple idol,woman stuck under statue woman stuck under elephant statue stuck under elephant statue gujarat viral video Gujarat temple Gujarat elephant statue, funny videos, viral video, bizarre video, woman devotee, elephant statue, stuck under, Temple, Lord Ganesh, Cujarat, viral video, funny video, Hillarous video

It’s not unusual for people in India to perform elaborate religious rituals in the hope that their wishes would be fulfilled. Recently, a woman tried to slide from beneath an idol as part of a ritual performed by devotees at a temple in Gujarat.

ITEMVIDEOS: ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య ఇరుక్కుపోయిన మహిళా భక్తురాలు

Posted: 07/05/2021 05:32 PM IST
Viral video woman gets stuck under elephant statue at gujarat temple

దేవుడిపై అపారా భక్తివిశ్వాసాలకు స్వర్గధామం ఏదైనా వుందీ అంటే అది భారత దేశమని చెప్పకతప్పదు. దేవుడు పాలు తాగుతున్నాడన్నా, కళ్లు తెరిచాడన్న ఆ వెంటనే తండోపతండాలుగా భక్తులు ఆయా ప్రాంతానికి వెళ్తి ప్రత్యేక పూజలు జరుపుకోవడం పరిపాటి. ఎలా పాలుతాగుతున్నాన్న, కళ్లు తెరవడం వెనుక మర్మమేంటి అన్న కోణంలో అలోచించే భక్తులు వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలోనే వుంటారు. ఇలాంటి మూడ విశ్వాసాలు కొన్ని ఆలయాల్లో మరీ ఎక్కువ. ఓ పలకాన్ని పట్టకుని చేతులు కదిలితే మీ కోరిక తీరుతుందని, నాణేలు నిలబడితే, తీర్థం నీరు తాగితే.. ఇలా అనేక విశ్వాసాలు.

ఆ కోవలోనే దేవాలయంలోని ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి వెళ్తే వారి సంకల్పం సిద్దిస్తుందన్న విశ్వాసం వుంది. ఆ ఫీటు చేయడానికి ఓ మహిళ భక్తురాలు రెడీ అయ్యింది. అయితే సాధారణంగా చేస్తే ఏం బాగుంటుంది అనుకుందో ఏమో ఏకంగా తాను ఏనుగు విగ్రహం పాదాల మధ్యనుంచి ఇటు నుంచి అటు వెళ్లడాన్ని వీడియో తీయించాలని అనుకుంది. దేవాలయాల్లో మొబైల్ ఫోన్లు వాడకూడదన్న నిబంధనకు కూడా తూట్లు పోడుస్తూ ఏకంగా రంగంతోకి దిగింది. తొలుత చాలా ఈజీగానే అనిపించినా ఆ తరువాత తాను చేసిన పని ఎంత క్లిష్టమైనదో తెలిసివచ్చింది.

ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలోకి దూరి మంచి పోజు ఇచ్చింది. కానీ.. ఆ తరువాత అనుకోకుండా ఆమె విగ్రహంలో ఇరుక్కుపోయి బయటకు రాలేక ముప్పు తిప్పలు పడింది. తన తోటి మహిళలు ఆమెను లాగడానికి ఎంతో ప్రయత్నించారు. అయినా.. లాభం లేకపోయింది.  ఇంకొందరు వెనుక నుంచి ఆమెను ముందుకు తోశారు. మరికొందరు ముందునుంచి అమె చేతులు పట్టుకుని లాగారు. అయిణా ఫలితం లేకపోయింది. చివరకు ఓ మహిళ అమె టీషర్టును సాయంగా పట్టుకుని లాగడంలో దాదాపుగా మూడు నిషాల తరువాత బయటకు వచ్చింది. దీంతో ఊపీరిపీల్చుకుంది. ఈ ఘటన గుజరాత్‌లోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది.

దీంతో అక్కడ ఉన్న భక్తులు చప్పట్లు కొడుతూ ‘జై అంబే’ అని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వీడియోను రాజేష్ అరోరా అనే వ్యక్తి పోస్టు ‘ఫేస్‌బుక్’లో పోస్టు చేశాడు. దీంతో క్షణాల్లో వీడియో వైరలయ్యింది. 2500 మంది షేర్ చేసుకున్నారు. ఈ వీడియో చూసినవారు.. ‘దేవుడా.. వీరికి కొంచెం బుద్ధిని ప్రసాదించు’ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మీరు లావుగా ఉన్నారనే విషయం తెలిసి కూడా అలా ఎలా విగ్రహం కిందకి దూరేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా.. ఫొటో కోసం మీరు కూడా ఎక్కడి పడితే అక్కడ దూరి కష్టాలు కొనితెచ్చుకోకండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles