12 BJP MLAs suspended from ‘Maha’ Assembly మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

Maharashtra 12 bjp mlas suspended for misbehaving with presiding officer

bjp mlas maharashtra legislative assembly, bjp mlas suspended, devendra fadnavis, bhaskar jadhav, shiv sena, bjp maharashtra, ashish shelar, maharashtra legislative assembly, Parag Alavani, Ram Satpute, Sanjay Kute, Ashish Shelar, Abhimanyu Pawar, Girish Mahajan, Atul Bhatkalkar, Harish Pimpale, Jayakumar Rawal, Yogesh Sagar, Narayan Kuche, Kirtikumar Bhangdiya, Maharashtra Politics

Twelve BJP MLAs have been suspended from the Maharashtra Legislative Assembly for one year for “misbehaving” with the presiding officer Bhaskar adhav in the Speaker’s chamber on Monday.

మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

Posted: 07/05/2021 04:28 PM IST
Maharashtra 12 bjp mlas suspended for misbehaving with presiding officer

మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజునే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అధిపత్యం ప్రతర్శించుకున్నాయి. విపక్ష పార్టీల నిరసనల మధ్య ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజునే ఏకంగా 12 మంది బీజేపికి చెందిన శాసనభ్యులపై ఏడాది పాటు వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో తాజా గణంకాల మేరకు కాకుండా పాత లెక్కల ప్రకారం ఓబీసీ కోటాను కేటాయిస్తామని అధికారంలో వున్న పార్టీలు స్పష్టం చేయడంతో ఈ అంశంపిై అసెంబ్లీలో చర్చ రసాబాసగా మారింది.

ఓబిసి కోటా అంశంపై మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. అంతటితో ఆగని బీజేపి ఎమ్మెల్యేలు స్పీకర్ భాస్కర్ జాదవ్ ఛాంబర్ లోకి వెళ్లి ఆయనను నిలదీయడంతో పాటు దూషిండచడంతో పాటు చేయికూడా చేసుకున్నారన్న ఆరోపణలపై .. 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఓబీసీ కోటాపై చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో దీనిపై మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్‌ భాస్కర్‌ జాధవ్‌ తమకు తగినంత సమయం ఇవ్వలేదని భావించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు.

అనంతరం ఆయన క్యాబిన్‌లోకి వెళ్లి స్పీకర్‌ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాక.. సమావేశాన్ని వాయిదా వేశారు. అసెంబ్లీ నిర్వహణలో స్పీకర్ పాత్రకు ఎంత ఔచిత్యముందో తెలుసుకోకుండా ఆయనపైనే దాడి చేసేందుకు యత్నించడం సహించరాదని అధికార పార్టీ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో బీజేపి అధికారంలో వుందని.. ఆయా ప్రాంతాల్లో విపక్ష సభ్యులు ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు మౌనంగా ఊరుకుంటారా.? అని ప్రశ్నించారు.

కాగా, బీజేపి పక్ష నేత దేవంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. స్పీకర్‌ని దూషించడం, దాడి చేయడం అనేది అధికార పార్టీ అల్లిన కట్టుకథ అని అన్నారు. స్పీకర్‌ కూడా తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరోపించారు. అయినా మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆశీష్ షెల్కర్ స్పీకర్ కు క్షమాపణలు చెప్పారని.. దాంతో ఆ అంశం ముగిపిసోయిందని అన్నారు. ఈ ఘటనపై అఎంబ్లీ స్పీకర్‌ జాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకులు నా క్యాబిన్‌ దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చూస్తూ.. దూషించారు. ఇదంతా దేవంద్ర ఫడ్నవీస్‌, సీనియర్‌ నాయకుడు చంద్రకాంత్‌ పాటిల్‌ ఎదురుగానే జరిగినా వారుకూడా అపలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles