Man climbs tree to rescue his pet cat in viral video తన పెంపుడు పిల్లి కోసం వెళ్లి.. ప్రమాదపుటంచున..

Man climbs tree to rescue his pet cat in viral video see what happened next

cat rescued by man, man rescues cat, viral video Oklahoma, viral cat video, fire department save cat, cat, Man climbs tree, Man to rescue his pet cat, fire department, Oklahoma, pet cat, pet owner, rescue team, america, crime

A man’s love for his pet cat made him do something that only a few would dare to do. A pet cat climbed up high on a tree and was stuck there. The cat's owner was concerned for his safety and did what he thought was the best he could - climbed up the tree to save his beloved pet.

ITEMVIDEOS: తన పెంపుడు పిల్లి కోసం వెళ్లి.. ప్రమాదపుటంచున..

Posted: 07/02/2021 05:56 PM IST
Man climbs tree to rescue his pet cat in viral video see what happened next

పెంపుడు జంతువులు అంటే ఎంతోమందికి ఇంట్లోని వ్యక్తులకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. వాటి కోసం ప్రత్యేక ఆహారాన్ని తీసుకురావడం, బయటకు వెళ్లడం.. ఇంటిళ్లిపాది బయటకు వెళ్లాలంటే ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం మనం చేస్తూనేవుంటాం. అవి అనారోగ్యంతో బాధపడినా.. ఇంటిని అశుభ్రపర్చినా.. ఇంట్లోని వస్తువులను పాడు చేసినా ఎంతో సహనం, శాంతంతో పనులు చేయాల్సివున్నా అన్నింటినీ భరిస్తారు. ఇలానే తన పెంపుడు పిల్లి కోసం బయటకు వెళ్లిన ఓ యజమాని తాను కూడా ప్రమాదంలోకి జారుకున్న ఘటన ఇది.

తన పెంపుడు పిల్లి ప్రమాదంలో ఉందని గమనించిన యజమాని దానిని రక్షించే ప్రయత్నం చేసి.. తాను ప్రమాదంలోకి జారుకున్న ఘటన అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి యజామానితో పాటు ఆయన పిల్లిని కాపాడగలిగారు. అమెరికాలోని ఓక్లహోమా నగరంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి పిల్లిని పెంచుకుంటున్నాడు. అది ఇంటి సమీపంలోని భారీ వృక్షాన్ని ఎక్కింది. అయితే దిగేందుకు వీలుకాకపోవడంతో అరవడం ప్రారంభించింది.

పిల్లి ప్రమాదంలో ఉందని గమనించిన యజమాని దానిని రక్షించేందుకు చెట్టు ఎక్కాడు. పిల్లిని రక్షించేందుకు చెట్టు ఎక్కి చుక్కుల్లో పడ్డాడు. దిగేందుకు విలుకాకపోవడంతో కింద ఉన్న వారికి విషయం తెలిపాడు. దీంతో వారు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. పొడవాటి నిచ్చన సాయంతో పిల్లిని దాని యజమానిని కిందకు దింపారు. ఇక ఈ రెస్క్యూకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లిపై అతడికి ఉన్న ప్రేమను అందరు మెచ్చుకుంటున్నారు. అయితే దానిని రక్షించే సమయంలో మీ భద్రతా కూడా చూసుకుంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles