పెళ్లి తరువాత బరాత్ లో భాగంగా పెళ్లికూతురిని, పెళ్లికోడుకును గ్రామశివార్ల వరకు ఆనందోత్సాహాల మధ్య సాగనంపే కార్యక్రమంలో భాగంగా వధువు తరపు బంధువులు నృత్యాలు చేస్తుండగా రంగంలోకి దిగిన కొత్తపెళ్లి కూతరు.. తమ బంధువులతో పాటు వరుడి తరపు బంధువులకు కూడా ముక్కున వేలేసుకునేలా చేసింది. అయితే ఇప్పటి తరం యువతీ యువకులు, పెద్దలు మాత్రం ఔరా.! అంటూ అమెను ప్రోత్సహించారు. అయినా తన పెళ్లికి తానే ప్రదర్శనలు ఇవ్వడం వెనుక కూడా అమెలోని సదుద్దేశం తెలిసిన బంధువులు.. అమెను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇంతకీ కొత్త పెళ్లి కూతురు ఏం ప్రదర్శనలు ఇచ్చింది.. అంటే కత్తి, కర్ర సాము ప్రదర్శనతో అదరగొట్టింది.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆత్మ రక్షణ కోసం తన చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఆ యువతి.. తన పెళ్లి ఊరేగింపులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఆమె స్నేహితురాళ్లు కూడా ఏకంగా 90 నిమిషాల పాటు వివిధ ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. ఇలా చేయడానికి కూడా కారణం ఉందని అమె అమె తెలిపింది. ఆ కారణాలు ఏంటంటే తమను ఇక్కడ ఇలా చూసిన మిగిలిన అమ్మాయిలు కూడా ఆత్మరక్షణ కోసం మార్షల్ అర్ట్స్ నేర్చుకుంటారని అమె తెలిపింది.
తనలా మిగతా అమ్మాయిలు కూడా ఆత్మరక్షణ కోసం ఎవరిపై ఆధారపడకుండా తమ విద్యను తాము నమ్ముకునేలా పెళ్లి చీరలోనే ప్రదర్శన ఇచ్చిన పెళ్లికూతురిని అందరూ ప్రశంసించారు. తమిళనాడులోని తిరుకోలూరు గ్రామానికి చెందిన పీ నిషా(22) వివాహం రాజ్ కుమార్ అనే వ్యక్తితో ఇటీవలే జరిగింది. అయితే వివాహ అనంతరం నిర్వహించిన ఊరేగింపులో.. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ విద్యతో నిషా అదరగొట్టింది. ఇక నిషాకు తోడుగా ఆమె ఫ్రెండ్స్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో తాము నేర్చుకున్న విద్యలను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు.
#WATCH Nisha from Thoothukudi district performed 'Silambattam', a form of martial art from Tamil Nadu, soon after her wedding ceremony on 28th June, to spread awareness about the importance of self-defense#TamilNadu pic.twitter.com/giLOPy1iDZ
— ANI (@ANI) July 1, 2021
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more