Bihar minister Madan Sahni threatens to resign ‘‘మా ప్రభుత్వాధికారులు లంచం ఇవ్వనిదే ఫైలు కదపరు’’

Bihar minister madan sahni resigns alleging corruption by bureaucrats

Madan Sahni, Madan Sahni bureaucrats, madan sahni bihar, madan sahni resign, madan sahni jdu, nitish kumar, tejashwi yadav, NDA government, JD(U) leader, Bihar government, Nitish Kumar, Bahadurpur, Darbhanga district, Bihar, Politics

“There is all-round corruption and high-handedness of bureaucracy in the State and fed-up with all these, now I’ve decided to resign from the Cabinet”, asserted Bihar Social Welfare Minister Madan Sahni. He said he called up Principal Secretary to CM thrice but “he didn’t pick up my phone, neither responded my message”.

మా ప్రభుత్వాధికారులు లంచం ఇవ్వనిదే ఫైలు కదపరు: అమాత్యులు

Posted: 07/02/2021 01:44 PM IST
Bihar minister madan sahni resigns alleging corruption by bureaucrats

‘‘మా ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైంది. ప్రభుత్వంలో ఉన్నతాధికారులే లంచాలకు ఎగబడుతున్నారు. అధికారులు అమ్యామ్యాలు లేనిదే అసలు ఫైలు కదపని పరిస్థితి ఏర్పడింది...’’ అంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శనాస్త్రాలు సంధించారు అమాత్యులవారు. ఏంటీ అమాత్యులే ఈ వ్యాఖ్యలు చేశారా.? అని సందేహాంగా వుందా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వంలో భాగమైన ఓ మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల విస్మయం చెందుతున్నారా.. ఇంతకీ ఇది ఏ రాష్ట్రంలో అని అడుగుతున్నారా.? ఆ వివరాల్లోకి వెళ్తే..

బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మదన్ సాహ్నీయే స్వయంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాన ప్రాతినిధ్యం వహిస్తున్న జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ అధినేత, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన అమాత్యులే ఈ వ్యాఖ్యలు సంధించడం విపక్షాలకు అస్త్రాలను అందించడమే. తన శాఖలోని బ్యూరోకాట్లు తన మాటకు విలువనీయకుండా తమ అదిపత్యం చెలాయిస్తూ తాను జారీ చేసిన ఆదేశాలను కూడా అమలుపర్చడం లేదని అరోపించారు.

తన శాఖలోనూ అదే జరుగుతోందని, అవినీతిని తట్టుకోలేక తాను తన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవికి ఈ శనివారం రోజున రాజీనామా చేయనున్నానని మదన్ సాహ్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే జనతా దళ్ యూనైటెడ్ పార్టీకి చెందిన అగ్రనాయకులైన ఆర్సీపీ సింగ్, అశోక్ చౌదరీ, సంజయ్ ఝాలకు చెప్పానని అన్నారు. తాను మంత్రి పదవితో దక్కే హోదా కోసమో లేక లేక విలాసవంతమైన భవనం కోసం, కారు కోసం మంత్రిని కాలేదని అన్నారు. తనను గత మూడు పర్యాయాలుగా గెలిపించిన తన బహదూర్పూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు బిహార్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమపథకాలను అందించేందుకేనని అన్నారు.

తాను చేపట్టిన సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శే తన అదేశాలను పాటించనప్పుడు తాను పదవిలో కొనసాగడంలో అర్థమేలేదని అన్నారు. తన శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ట్రాన్స్ ఫర్ చేయాలన్న అదేశాలు కూడా అమలు కానప్పుడు తాను మంత్రిగా కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. శనివారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాకు చేరుకోగానే తాను తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానన్నారు. తనలాగే మిగతా మంత్రులు కూడా ఇలాంటి అవమానాలకు గురవుతున్నారని, అయితే తాను గళం విప్పినందుకు వారు సంతోషపడతారని అన్నారు.

ఈ నేపథ్యంలో మదన్ సాహ్నికి బీజేపి సహా సొంత పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా తోడైంది. సాహ్ని చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజా ట్రాన్స్ ఫర్లు, పోస్టింగుల విషయంలో భారీ స్థాయిలో డబ్బులు ప్రముఖ పాత్ర పోషించాయని బర్హ్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపి ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ గయాను అరోపించారు. బీజేపి నుంచి మంత్రిపదవులు పొందిన నేతలు డబ్బును అర్జించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు.

రాష్ట్రంలోని శాసనసభ్యుల పరిస్థితి నాల్గవ తరగతి ఉద్యోగుల కంటే దారుణంగా మారింపోయిందని మధుభానీ జిల్లాలోని భిస్పీ ఎమ్మెల్యే హరిభూషన్ థాకూర్ ఆరోపించారు. బ్లాక్ స్థాయిలో ఎక్కడ చూసినా అవినీతి తిష్టవేసిందని.. దీనిపై తాము ఎన్ని పిర్యాదులు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని అరోపించారు. ఇక సాహ్నికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీహార్ లోని అధికార ఎన్డీయే ప్రభుత్వ మిత్రపక్షమైన హిందుస్తానీ అవామ్ మోర్చా(సెక్యూలర్) అధినేత జితన్ రామ్ మాంఝీ కూడా మద్దతు ప్రకటించారు. అమాత్యులను అవమానపర్చడం, వారి స్థాయిని తగ్గించేట్లు చేయడం ప్రభుత్వ బ్యూరోకాట్లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles