Crocodile strolls through village in Karnataka నీటిని విడచి జనారణ్యంలోకి వచ్చిన మొసలి.!

Watch crocodile found strolling through kogilban village in dandeli

Crocodile, Dandeli, Karnataka Forest Department, Kogilban Village, Dandeli district, Kali River, Karnataka, Crime, viral video, Twitter, social media, Video viral, Politics

A crocodile found strolling through Kogilban village in Karnataka's Dandeli. Later, forest officials rescued the crocodile and released it into the river. The entire video of the incident surfaced on social media.

ITEMVIDEOS: నీటిని విడచి జనారణ్యంలోకి వచ్చిన మొసలి.. వీడియో వైరల్.!

Posted: 07/02/2021 02:53 PM IST
Watch crocodile found strolling through kogilban village in dandeli

న‌దులు, కాలువ‌ల్లో ఉండే మొస‌ళ్లు చెరువుల్లోకి వ‌స్తేనే భ‌య‌ప‌డిపోతాం. అటు వైపు వెళ్లడానికి కూడా సాహసం చేయం. ఎంతటి ధైర్యవంతులైనా మొసలి వుందంటేనే ఆ పనులు మానుకుంటారు. ఎందుకంటే అవి అంత డేంజర్. చూడటానికే భయంకరంగా వుండే మొసళ్లు.. విహారయాత్రకు వచ్చినట్లుగా జనారణ్యంలోకి వస్తే.. ఇంకేమైనా వుందా.? దానిని చూసిన వెంటనే గుండెలదిరిపోతాయ్. కానీ ఇక్కడ అదే జరిగింది. ఏకంగా మొసలి ఊర్లోకే వచ్చేసి.. తనను ఎవరూ పట్టించుకోలేదని అరిచేసింది.

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర్ కర్ణాటక ప్రాంతంలోని ధనధెల్లి జిల్లా పరిధిలోని కోగిల్బాన్ గ్రామంలోకి ఓ భారీ మొస‌లి వ‌చ్చింది. కొంత దూరం నడిచిన మొసలి ఆ తరువాత అలసిందో లేక తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకుందో లేక అది వెతుకున్నది లభించడం లేదని, లేక నది నుంచి దారి తప్పి ఎటు వచ్చాన్రో దేవుడా.. అని అవేదన చెందిందో తెలియదు కానీ నడక ఆపేసి అరిచేసింది. దీంతో స్థానికులంతా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇండ్ల‌ను మూసేసుకోవ‌డంతో ఆ కాల‌నీ అంతా నిర్మానుష్యంగా మారింది.

భారీ ఆకారంలోని మొసలి రోడ్డుపై నడుస్తూ ఉండే అందరూ భయపడిపోయారు. ఇళ్ల తలుపులు మూసుకోవడం తప్ప మరేమి చేయలేకపోయారు. అయితే కొందరు మాత్రం కొంత ధైర్యం చేసి మొసలి కంట పడకుండా దానిని వీడియోను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఇక వెంటనే ఆ వీడియోలను స్థానిక అటవీశాఖ అధికారులకు పంపించారు. దీంతో స‌మాచారం అందుకున్న అట‌వీశాఖ అధికారులు.. మొస‌లిని బంధించి సమీపంలోని కాళీ న‌దిలో వ‌దిలేశారు. అయితే ఆ తరువాత ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడా వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Crocodile  Dandeli  Kogilban Village  Kali River  Karnataka Forest Department  Karnataka  viral video  

Other Articles