Delta variant cannot be ignored, say experts డెల్టా ప్లస్ వేరియంట్ తేలిగ్గా తీసుకోవద్దు: నిఫుణులు

Delta variant cannot be ignored say experts

Delta plus variant, Maharashtra, Andhra Pradesh, corona third wave, Dr Lava Kumar, Delta plus, corona third wave

The Delta variant is posing a threat to the State, which has just overcome with the second wave of coronavirus. The health experts have b een suggesting the government to remain careful and be prepared to tackle the new mutation as neighbouring Maharashtra has high cases of it.

డెల్టా ప్లస్ వేరియంట్ తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న నిఫుణులు

Posted: 06/30/2021 05:40 PM IST
Delta variant cannot be ignored say experts

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఇటీవల వెలుగులోకి వస్తున్నాయని వాటిని తేలిగ్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుక ఎప్పుడో మొదలైందని కూడా చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రెండున్నర నెలల క్రితమే వీటి ఉనికి ఆరంభమైంది. తిరుపతిలో ఏప్రిల్ లో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో తాజాగా డెల్టా ప్లస్‌ రకాన్ని సీసీఎంబీ గుర్తించిందని అన్నారు. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా వేరియంట్‌ ను కూడా 2020 చివర్లోనే గుర్తించారని కాగా తొలుత ఈ రకం కేసులు పరిమితంగానే నమోదయ్యాయని అన్నారు.

మహారాష్ట్రలోనూ ఫిబ్రవరిలో 10 శాతంలోపే ఉన్నాయని అయితే మార్చి ఆఖరు.. ఏప్రిల్‌ నాటికి 80 శాతానికి చేరాయని.. ప్రస్తుతం డెల్టా ప్లస్‌ కేసులు కూడా అలానే ఆకస్మాత్తుగా ఉద్దృతికి సృష్టిస్తాయని అన్నారు. అందుకే వాటిని తేలిగ్గా తీసుకోవద్దని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఈ రకం వ్యాప్తి తీరుతెన్నులు తెలిసేవరకు జాగత్త్రలు పాటించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. కాగా, తిరుపతిలో ఏప్రిల్లో భయటపడిన డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పటికే తన ఉద్దతిని చాటాలని, కానీ జరగలేదని అంటున్నారు. సదరురోగితో పాటు అతని చుట్టూ వున్నవాళ్లు జాగ్రత్తలు పాటించడంతో వ్యాప్తి ఆగిపోయి ఉండవచ్చునని అంటున్నారు.

లేకపోతే ఆ ప్రాంతంలోని నమూనాల్లో వైరస్‌ జన్యు పరిణామక్రమ విశ్లేషణలు తగిన స్థాయిలో జరిగి ఉండకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చునన్నారు. వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణతోపాటు వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు జాతీయ ప్రయోగశాలల్లో వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి సీసీఎంబీకి నమూనాలు వస్తుంటాయి. వారానికి ఒకసారి వీటి జన్యు పరిణామ క్రమాలను కనుగొంటుంటారు. తిరుపతి నుంచి ఏప్రిల్‌లోనే నమూనాలు రాగా.. అప్పట్లోనే మ్యుటేషన్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా కొత్త వేరియంట్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇటీవల దీనికి డెల్టా ప్లస్‌ రకమని పేరు పెట్టడంతో.. తాము గుర్తించిన రకం కూడా ఇదేనని జీనోమ్‌ కన్సార్షియం ఇన్సకాగ్‌కు వారు సమాచారం ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles