Lashkar militant held for Darbhanga blast visited Pakistan ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్..

Two let terrorists held in connection with dharbhanga station blast case

National Investigation Agency, Lashkar-e-Taiba, chemical bomb, Imran Malik, Nasir Malik, Hyderabad, Uttar pradesh, Durbanga bomb blast, Nampally, Telangana, crime

The NIA arrested Lashkar-e-Taiba (LeT) terrorists Imran Malik alias Imran Khan and Mohd Nasir Khan alias Nasir Malik, in Hyderabad, in connection with the explosion of a parcel at Darbhanga Railway Station in Bihar. The key conspirators in the case, who belong to Shamli district of Uttar Pradesh, were residing at Nampally in the city.

రైలు ప్రమాదానికి కుట్ర పన్నిన ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్..

Posted: 07/01/2021 11:31 AM IST
Two let terrorists held in connection with dharbhanga station blast case

బీహార్ లో బాంబు పేలుళ్లకు హైదరాబాద్ లో అరెస్టులు జరుగుతున్నాయి. బీహార్ లోని దర్భంగా రైల్వేస్టేషన్ లో ఓ రైలు బోగీ నుంచి పార్శిళ్లు కిందికి దింపుతుండగా జరిగిన పేలుళ్లకు పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పనేనని భారత భద్రతా దళాలు గుర్తించాయి. ఓ సీసా నుంచి పొగలు వచ్చి, ఆపై పేలుడు జరిగినట్టు వెల్లడైంది. దీన్ని లోతుగా పరిశోధించడంతో ఇది ఉగ్రదాడి అని నిర్థారించుకున్న భారత దర్యాప్తు సంస్థలు దీనికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం దర్యాప్తు ప్రారంభించగా దాని లింకులు హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించారు.

ఈ క్రమంలో ఈ కేసు విచారణను స్వీకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాదులో నాసిర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ అనే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరే అనుమానాస్పద పార్శిల్ ను సికింద్రాబాద్ లో బుక్ చేసినట్టు భావిస్తున్నారు. వీరిద్దరూ అన్నదమ్ములు. నాసిర్ ఖాన్ తొమ్మిదేళ్ల కిందట పాకిస్థాన్ వెళ్లి ఉగ్రశిక్షణ పొందాడు. రసాయనాలతో పేలుడు పదార్థాలు చేయడంలో ఆరితేరాడు. ఆపై హైదరాబాద్ వచ్చి సోదరుడు ఇమ్రాన్ తో కలిసి ఐఈడీ బాంబులు తయారుచేశాడు.

 అనంతరం ఓ వస్త్రాల పార్శిల్లో పేలుడు పదార్థాలతో కూడిన సీసా ఉంచారు. దాన్ని సికింద్రాబాద్-దర్భంగా రైల్లో పంపారు. రసాయనాలు కదులుతున్న రైలు కదలికలకు పేలి మంటలు వ్యాపించి రైలు అగ్నిప్రమాదానికి గురయ్యేలా కుట్ర పన్నారు. అయితే రసాయనాలు సరైన మోతాదులో వినియోగించికపోవడంతో అది కాస్తా దర్బాంగాలో ఈ పార్శిల్ బోగీ నుంచి అన్ లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. అయితే వారు అన్నకున్నంత తీవ్రస్థాయిలో కాకుండా స్వల్పంగానే పేలుడు జరిగింది. ప్రస్తుతం ఈ సోదరులిద్దరినీ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. వీరు గతంలో ఏమైనా పేలుళ్లకు కారణమయ్యాయా.? అన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటున్న ఎన్ఐఏ అధికారులు.. ఇంకేమైనా కుట్రలు పన్నారా? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lashkar-e-Taiba  chemical bomb  Hyderabad  BIhar  Durbanga bomb blast  Nampally  Telangana  crime  

Other Articles