Andhra women's safety through Disha app ఆడపడచులకు అన్న తోడు.. దిశ యాప్: సీఎం జగన్

Andhra cm ys jagan launches disha app for women awareness

Disha App, Andhra Pradesh, AP Government, YS Jagan, Disha App news, Disha App launched, Disha App released, Disha App safety, Disha App download, Disha App help, Disha App how to use, Disha App uses, Disha App tracking, Disha App details, Disha App on Play store, Disha App on App store, YS Jagan launches Disha App for Women Awareness

Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy launched Disha App today in the presence of hundreds of women in a public meeting that was held in Gollapudi village near Vijayawada. The women police and village volunteers will work as the ambassadors of Disha app told YS Jagan.

ఆంద్రప్రదేశ్ ఆడపడచులకు అన్న తోడు.. దిశ యాప్: సీఎం జగన్

Posted: 06/29/2021 04:43 PM IST
Andhra cm ys jagan launches disha app for women awareness

ఆంధ్రప్రదేశ్ ఆడపడచులకు ఆన్న తోడుగా నడిస్తే కలిగే భరోసా.. వారి చేతిలో సెల్ ఫోన్లలో వున్న దిశ యాప్ కలిగిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆడపడచులు ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో వెళ్లినా ఈ యాప్ ను యాక్టివ్ గా చేసుకుంటే చాలునని.. ఈ యాప్ వారిని నిత్యం పర్యవేక్షిస్తూనే వుందని ఆయన తెలిపారు. ప్రమాదాలు, ముప్పులు ఎవరికీ ఎప్పుడు వస్తాయో తలియదని, అందుకనే ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టిన సమయంలో వారు ఈ యాప్ ను యాక్టివేట్ చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ యాప్ ప్రతి మహిళకు అవసరమని పేర్కోన్నారు.

దిశ యాప్ పై రాష్ట్రంలోని అడపడచులందరికీ అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఒక్క ఆడపడచుకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దిశ యాప్ కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం అన్నారు. ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో భాగంగా మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని జగన్ వివరించారు.

దిశ యాప్‌ను ప్రతిఒక్క మహిళతో డౌన్‌లోడ్ చేయించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఘటన తనను కలిచివేసిందని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. యువతులు, మహిళల భద్రత కోసం ఈ దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ దగ్గర దిశ యాప్ ఉండాలని సూచించారు.

ఫోన్లలో దిశ యాప్‌ ఉంటే ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులను.. మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్‌ విధానంలో వీక్షించారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles