Indian man crosses border to marry Bangladeshi woman సరిహద్దులు దాటి.. కటకటాలపాలైన ప్రేమజంట..

Indian man crosses border to marry bangladeshi woman gets arrested on return

India bangladesh border, indian man crosses border, indian man weds bangladeshi girl, international border, human trafficking, Nadia, BSF, Madhupur, Indian man, Jaikanto Chandra Rai, Bangladesh woman, parineeti, newlyweds, cross border love, facebook, BSF Intelligence, Bhimpur police station, West Bengal, Crime

The Border Security Force (BSF) arrested an Indian national and a Bangladeshi woman in West Bengal’s Nadia district for illegally crossing the international border. During questioning, they said they were newlyweds who met online, fell in love and decided to get married despite living on opposite sides of the border

ఫేస్ బుక్ పరిణయం: సరిహద్దులు దాటి.. కటకటాలపాలైన ప్రేమజంట..

Posted: 06/28/2021 05:48 PM IST
Indian man crosses border to marry bangladeshi woman gets arrested on return

ప్రేమించాడు అంతేకాదు తనను నమ్మిన యువతని ధైర్యంగా పెళ్లాడాడు. అయితే హ‌ద్దులు తెలియని వయస్సులో తెగించి చేసిన తప్పు.. అతడ్ని కటకటాలపాలు చేసింది. అతడ్నే కాదు అతని భార్యను కూడా ఊచల వెనక్కి నెట్టింది. అతను చేసిన తప్పు ఏంటో తెలుసా.? పరదేశపు యువతిని ప్రేమించి పెళ్లాడి తీసుకురావడమే.. అంటే నిజంగా ఆశ్చర్యపోతారు కదూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులయ్యే అనేక మంది విదేశీయులు తమ సంతానానికి భారత్ వధువు, వరులను ఎంచుకుని పెళ్లిళ్లు జరిపిస్తుండగా, ఇక్కడ మాత్రం వీరిని కటకటాల వెనక్కి నెట్టడం ఏంటీ.? అంటారా..?

ఎవరు భారతదేశంలోకి అడుగుపెట్టాలని భావించినా.. వారికి మన దేశం వీసాను ఏర్పాటుచేస్తోంది. కానీ ఇక్కడ ఈ జంట ఎలాంటి పాస్ పోర్టు, వీసాలు లేకుండా దేశంలోకి నేరుగా చేరుకోవడం.. భారత్-బంగ్లా దేశాల్లోని సరిహద్దుకు ఇరువైపులా వున్న వారు అక్రమంగా బార్డర్ దాటడమే వీరిని నిందితులను చేసింది. ప‌శ్చిమ బెంగాల్ న‌దియా జిల్లాలోని బ‌ల్లావ్‌పూర్ గ్రామానికి చెందిన జైకాంతో చంద్ర‌రాయ్ (24)కు ఫేస్‌బుక్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అమ్మాయి ప‌రిచ‌యమైంది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని చంద్ర‌రాయ్ నిర్ణ‌యించుకున్నాడు.

దీంతో ఈ ఏడాది మార్చి 8న ఓ బ్రోక‌ర్ స‌హాయంతో స‌రిహ‌ద్దు దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మార్చి 10న తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అక్క‌డే ఇద్ద‌రూ జూన్ 25వ తేదీ వ‌ర‌కు క‌లిసి ఉన్నారు. పరిణితిని పెళ్లి చేసుకోవాలన్న తన స్వప్నం సాకారమైందని బావించిన యువకుడు తన స్వస్థలానికి చేరుకోవాలని అనుకున్నాడు. జూన్ 26న చంద్ర రాయ్ త‌న సొంతూరికి స‌రిహ‌ద్దు గుండా బ‌య‌ల్దేరాడు. స‌రిహ‌ద్దును దాటించేందుకు చంద్ర‌రాయ్ బంగ్లాదేశ్ స్థానికుల‌కు రూ. 10 వేలు బంగ్లా టాకాలు ఇచ్చాడు.

అయితే బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ బృందానికి ఈ జంట అక్రమంగా సరిహద్దును దాటుతున్నారన్న సమాచారం అందింది. వెంటనే సరిహద్దులోని జవాన్లను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జూన్ 26న స‌రిహ‌ద్దు గుండా వస్తున్న ఈ జంటను మధుపూర్ సరిహద్దుల్లో బ‌ల‌గాలు అదుపులోకి తీసుకున్నాయి. బ‌ల‌గాల విచార‌ణ‌లో వారిది ప్రేమ వివాహం అని తేలింది. అబ్బాయిది బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తేల‌డంతో.. స‌రిహ‌ద్దు దాటేందుకు వారికి స‌హ‌క‌రించిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అరెస్టు అయిన న‌వ దంప‌తులు పోలీసుల క‌స్ట‌డీలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles