Dr Reddy's announces commercial launch of drug 2DG కరోనాపై పోరుకు 2డీజీ మెడిసిన్ కమర్షియల్ లాంచ్

Dr reddy s labs announces commercial launch of anti covid drug 2dg

2-deoxy-D-glucose drug, commercial Launch, cure, efficacy, Dr. Reddy’s, Covid-19, 2DG, DRDO, Coronavirus, Covid-19 medicine, health ministry, ministry of defence, novel coronavirus, treatment, Dr reddys lab, 2-DG, DRDO natocovis drug, anti covid thera;py forr moderate to severe patinets, price of 2DG, aavailability of 2dg, anti covid treatment option, covid vaccine, sputnik

Dr. Reddy’s Laboratories today announced the commercial launch of 2-deoxy-D-glucose(2-DG), a medicine developed by the Defence Research and Development Organisation(DRDO) for the treatment of Covid-19 patients. Dr. Reddy’s will supply to major Government as well as private hospitals across India.

కరోనాపై పోరుకు డీఆర్డీఓ-రెడ్డీస్ ల్యాబ్ మెడిసిన్ కమర్షియల్ లాంచ్

Posted: 06/28/2021 02:57 PM IST
Dr reddy s labs announces commercial launch of anti covid drug 2dg

దేశంలో కరోనా మహమ్మారి రెండవ దశ ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతున్న క్రమంలో వైద్యఆరోగ్య శాఖకు చెందిన నిపుణులతో పాటు వైద్యులు, అసుపత్రి సిబ్బంది. అందరూ కాసింత ఉపశమనం పోందుతున్న తరుణంలోనే మరోమారు మూడో వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటి నుంచే దాని విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. కొత్త వేరియంట్‌ డెల్టా ప్లస్‌ తన రాకకు ముందునుంచే ప్రజలను తీవ్రంగా భయపెడుతోంది. దీంతో కరోనా వైరస్ ను దోబుచులాటతో పక్కదారి పట్టించే ఔషధాన్ని డీఆర్డీఓ సంస్థలు కలసి రూపోందించిన విషయం తెలిసిందే.

అయితే ధర్డ్ వేవ్ రాక ముందునుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర వైద్యాధికారులతో పాటు దేశీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ గుడ్‌  న్యూస్‌ చెప్పింది. డాక్టర్ రెడ్డీస్ కూడా డీఆర్డీఓ సాయంతో తయారు చేసిన 2డీజీ ఔషధాన్ని కమర్షియల్ లాంచ్ చేసింది. కరోనా చికిత్సలో ప్రభావవంతగా పనిచేస్తున్న, డీఆర్‌డీవో, రెడ్డీస్‌ సంయుక‍్తంగా  అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) డ్రగ్‌ ఇక మార్కెట్‌లో లభ్యం కానుంది. దేశంలోని ప్రధాన ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ ఉత్పత్తిని సరఫరా చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.  99.5 శాతం సమర్ధత కలిగిన   ఈ 2డీజీ  సాచెట్   990  రూపాయల వద్ద  ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనుంది.

మొదట్లో తమ ఉత్పత్తి 2 డీజీ ఔషధం మెట్రో, టైర్-1 నగరాల్లోని ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుందనీ, ఆతరువాత భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ  అందుబాటులోకి తీసుకొస్తామని అని కంపెనీ ఒక ప్రకటన తెలిపింది. దీంతో  రెడ్డీస్‌ ఉదయం సెషన్‌లో షేర్ ధర ఒక శాతం ఎగిసింది.  డాక్టర్ రెడ్డీస్ సహకారంతో డీఆర్‌డీవో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్  అండ్‌ అలైడ్ సైన్సెస్  భాగస్వామ్యంతో  ఈ 2 డీజీ  డ్రగ్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన  సాధారణ నుంచి తీవ్ర లక్షణాలున్న  కరోనా రోగులకు అనుబంధ చికిత్సగా  దీన్ని ఉపయోగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles