Drone Attack at Jammu Air Base Well-planned మరోసారి డ్రోన్ దాడి.. తిప్పికొట్టిన భారత బలగాలు

India 2 more drones spotted over kaluchak military station

Drone Attack, iaf, Indian Air Force, Mi-17 helicopters, target, jammu, pakistan, Jammu Kashmir, kaluchak military station, kaluchak drones, Jammu Air Force station attack, Jammu blast, Jammu iAF base blast, Jammu Air Force station blast, jammu drone attack, crime news

A day after a drone attack on Indian Air Force’s (IAF’s) technical airport in Jammu, two more drones were spotted hovering over Kaluchak and Ratnuchak military stations

అర్థరాత్రి వేళ.. మరోసారి డ్రోన్ దాడి.. తిప్పికొట్టిన భారత బలగాలు

Posted: 06/28/2021 03:52 PM IST
India 2 more drones spotted over kaluchak military station

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడి ఐఎస్ఐ సహా ఆర్మీ సహకారంతో భారత్ పై సరికొత్త తరహాలో దాడులకు తెగబడుతున్నాయి. భారత అర్మీకి చెందిన బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ పై డ్రోన్ దాడి జ‌రిగిన 24 గంటల వ్యవధి కూడా గడవక ముందే మరోమారు రెండు డ్రోన్లు భారత్ ఆర్మీ ఎయిర్ వేస్ ను స్థావరాన్ని టార్టెట్ చేసి దాడులకు యత్నించడం క‌ల‌క‌లం రేపాయి. జ‌మ్ములోని కాలుచాక్ మిలిట‌రీ స్టేష‌న్ లో ఆదివారం అర్ధ‌రాత్రి క‌నిపించాయి.

రాత్రి 11.30 నిమిషాల‌కు ఓ డ్రోన్ ఆర్మీ బేస్‌పై ఎగురుతూ క‌నిపించ‌గా.. మ‌రొక‌టి అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత 1.30 గంట‌ల ప్రాంతంలో క‌నిపించింది. వెంట‌నే అలెర్ట్ అయిన ఆర్మీ జ‌వాన్లు వాటిపై ఫైరింగ్ జ‌రిపారు. జ‌మ్ము ప‌ఠాన్ కోట్ నేష‌న‌ల్ హైవేపై కాలుచాక్‌-పూర్మాండ‌ల్ ప్రాంతంలో రెండు క్వాడ్ కాప్ట‌ర్స్ క‌నిపించాయి. కాలుచాక్ మిలిట‌రీ స్టేష‌న్ కు ద‌గ్గ‌ర‌గా ఎగురుతూ క‌నిపించాయి అని పోలీసులు వెల్ల‌డించారు. ఆర్మీ జ‌వాన్లు 20-25 రౌండ్ల కాల్పులు జ‌రిపారు. అయితే చీక‌ట్లో ఆ రెండు డ్రోన్లు త‌ప్పించుకుని వెళ్లిపోయాయి. వాటిని క‌నిపెట్ట‌డానికి పెద్ద ఎత్తున సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నారు.

భారత బలగాల కాల్పులతో ఆగంతకులు డ్రోన్లను వెనక్కు తీసుకెళ్లారు. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు డ్రోన్ దాడికి యత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ‌మ్ము ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీ స్టేష‌న్ల‌లో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. జ‌మ్ములో ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌పై తొలిసారి డ్రోన్ దాడి జ‌రిగిన మ‌రుస‌టి రోజే ఇలా మ‌రో రెండు డ్రోన్లు క‌నిపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. డ్రోన్ల‌తో దాడి చేయ‌డం అనేది ఇదే తొలిసారి. ఆదివారం తెల్ల‌వారుఝామున రెండు పేలుళ్లు జ‌రిగాయి. ఈ ఉగ్ర‌దాడిపై జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు, నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drone Attack  iaf  Indian Air Force  Mi-17 helicopters  target  jammu  pakistan  

Other Articles