bear charging towards a biker in Tamil Nadu నెట్టింట్లో ఆనంద్ర మహీంద్రా షేర్ చేసిన వీడియోపై ఉత్కంఠ.!

Anand mahindra shares scary video of bear charging towards a biker

Bear, Anand Mahindra, Twitter, Jawa Motorcycles team, Bear charge, Biker, Nilgiris, Tamil Nadu, Scary video, viral video, video viral

Mahindra Group Chairman Anand Mahindra posted a terrifying video of a bear running towards a person on a bike. Anand Mahindra took to Twitter to post a scary video of a bear rushing at rider on a bike. According to Anand Mahindra's description, the footage is from Nilgiris in Tamil Nadu.

ITEMVIDEOS: నెట్టింట్లో ఆనంద్ర మహీంద్రా షేర్ చేసిన వీడియోపై ఉత్కంఠ.!

Posted: 06/26/2021 05:25 PM IST
Anand mahindra shares scary video of bear charging towards a biker

మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఆనంద్ మహీంద్రా.. భారత దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్తల్లో ఒకరైనప్పటికీ అందరికీ భిన్నంగా ఆయన వ్యవహరిస్తుంటారు. తన సామాజిక మాద్యామల అకౌంట్ల ద్వారా ఆయన తన సోంత బ్రాండును ప్రమోట్ చేసుకోవడం కంటే ఆసక్తికరమైన సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడంలో ముందుంటారు. పైగా వాటికి స్పెషల్ కామెంట్ పెడుతుంటారు.  గా మోటార్ సైకిళ్లను వెంటాడుతున్న ఎలుగుబంటి వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అయితే ఈ వీడియోపై నెట్టింట్లో ఉత్కంఠకు తెరతీసింది.

తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు 52వేల వ్యూస్ వచ్చాయి. పైగా వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు. ఇదంతా ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. టీ గార్టెన్ లో ఇరు వైపులా ఉన్న పొదలు చూపిస్తుండగా వీడియో మొదలైంది. అలా పచ్చని ప్రకృతిలో వెళ్తుండగా.. రోడ్ మీదే మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. అంతే వాటిని చూడగానే ఆగిపోయిన ఆ వ్యక్తి దూరం నుంచే చూస్తూ వీడియో రికార్డ్ చేస్తూ ఉండిపోయాడు.

అలా కాసేపు వరకూ అంతా ప్రశాంతంగా ఉన్నా.. కొద్ది సెకన్లు గడిచాక ఒక ఎలుగుబంటి అతని వైపు పరిగెత్తుకురావడం మొదలైంది. దాంతో వీడియో పూర్తి అయింది. ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి. జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి’ అని ఆ పోస్టుకు కామెంట్ పెట్టారు. కాగా, ఈ వీడియోను తిలకించిన నెటిజనులు మహీంద్రా గారు.. బైకర్లకు ఏమైంది..? ఎలుగుబంటి వారికేమీ హాని చేకూర్చేలేదు కదా.? అంటూ ఉత్కంఠగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇందుకు సంబంధించి ‘‘ఆ తరువాత’’ క్యాఫ్షెన్ తో మరో వీడియో కూడా పెట్టాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bear  Anand Mahindra  Twitter  Jawa Motorcycles team  Bear charge  Biker  Nilgiris  Tamil Nadu  viral video  

Other Articles

Today on Telugu Wishesh